బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఈ మధ్య కొంచెం డిమాండ్ తగ్గింది కానీ.. అతడి సినిమాల బడ్జెట్లు, పారితోషకాలు వేరే స్థాయిలోనే ఉంటాయి. క్యామియో రోల్స్ చేసినా సరే.. రోజుకు కోటికి తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ పుచ్చుకునే స్థాయి అతడిది. ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొంటున్న అక్షయ్‌కి ‘ఓఎంజీ-2’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఇందులో అక్షయ్ చేసింది అతిథి పాత్రే అయినా కథలో ఆయన పాత్ర కీలకం.
‘గదర్-2’ పోటీని తట్టుకుని ఈ సినిమా దాని స్థాయిలో మంచి వసూళ్లే సాధించింది. వంద కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా.. అక్షయ్ భారీ పారితోషకం తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఆ ప్రచారాన్ని నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధారె ఖండించాడు. అక్షయ్ అసలు పారితోషకమే తీసుకోకుండా ఈ సినిమాలో ఉచితంగా నటించినట్లు వెల్లడించాడు.
‘‘ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. అక్షయ్ పారితోషకం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు రాసేస్తున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. నిజానికి ‘ఓ మై గాడ్-2’ కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ముందుకు వెళ్లడం కోసం ఆయనే మాకు ఆర్థిక సాయం చేశారు. అనేక అంశాల్లో కీలకమైన సలహాలు ఇచ్చి మాకు తోడుగా నిలిచారు.
‘ఓ మై గాడ్’ రోజుల నుంచి మేం కలిసి సినిమాలు చేస్తున్నాం. మా స్నేహం సుదీర్ఘమైనది. ఇలాంటి విభిన్నమైన సినిమాలకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారు’’ అని అజిత్ తెలిపాడు. ఐతే అక్షయ్ పారితోషకం తీసుకోకపోయినా.. సినిమా విజయవంతం అయింది కాబట్టి లాభాల్లో ఆయనకు వాటా ఉంటుందని అజిత్ చూచాయిగా చెప్పారు. ఈ లెక్కన రెమ్యూనరేషన్‌గా వచ్చేదానికంటే అక్షయ్ ఎక్కువే అందుకుంటాడన్నమాట.
This post was last modified on August 19, 2023 7:20 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…