యాంకర్, నటి అనసూయ కన్నీటి పర్యంతం అయ్యింది. సోషల్ మీడియా వేదిక ఇన్స్ టాగ్రామ్ లో ఏడుస్తూ ఉన్న ఒక చిన్న వీడియోతో పాటు సుదీర్ఘమైన మెసేజ్ పెట్టి అభిమానులను షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఫోటోలు, పోస్టులు విరివిగా షేర్ చేసుకున్న అనసూయకు వాటి వల్ల రకరకాల స్పందనలు ఎదురయ్యాయి. అయినా వాటిని లెక్క చేయలేదు కానీ అప్పుడప్పుడు ధీటుగా బదులివ్వడం చూస్తూనే ఉన్నాం. విజయ్ దేవరకొండ పేరు ముందు ది పెట్టుకున్న విషయంలో రచ్చ చేయడం ఫ్యాన్స్ కి ఇంకా గుర్తుండే ఉంటుంది.
ఇక అనసూయ ఇంగ్లీష్ లో పెట్టిన పోస్టు సారాంశం ఇలా ఉంది. నాకు తెలిసి ప్రాథమికంగా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఉద్దేశించినదే సోషల్ మీడియా. ఒకరికొకరు మద్దతుగా నిలవాలనే ఇక్కడకు వస్తాం. సంతోషం, బాధ అన్నీ పంచుకోవడానికి ఉంటాం. నేను షేర్ చేసుకున్న ప్రతి జ్ఞాపకం, డాన్సులు, ఫోజులు, బలమైన కౌంటర్లు, కంబ్యాక్ లు ఇవన్నీ నా లైఫ్ లో భాగమే. బలంగా లేని రోజుల్లో నాకూ ఎదురుదెబ్బలు, ఎత్తుపల్లాలు వచ్చాయి. ఒక పబ్లిక్ ఫిగర్ గా వీటిని నేను తప్పించుకోలేను. అలా అని తలొగ్గను. అందరికీ చెడ్డ రోజులు వస్తాయి. అయిదు రోజులు క్రితం జరిగిన ఒక సంఘటనకు స్పందనే ఇది.
చెప్పీ చెప్పనట్టు అనసూయ పెట్టిన ఇన్స్ టా పోస్టులో పూర్తి వివరాలు లేవు. అంతగా బాధించిన వ్యక్తి లేదా ఘటన ఏదైనా దానికి సంబంధించిన వివరణ కొంతైనా ఇచ్చి ఉంటే బాగుండేది. అంత పొడవైన సందేశంలో క్లారిటీ మిస్ అయ్యింది. అయినా సెలబ్రిటీలు అన్నాక నెటిజెన్లు ఏదో కారణంతో లక్ష్యంగా చేసుకోవడం సహజం. దానికి ఎవరూ మినహాయింపు కాదు. కేవలం ఒకరో ఇద్దరో బలవ్వడం ఉండదు. సంపూర్ణేష్ నుంచి మెగాస్టార్ దాకా అందరూ వీటి బారిన పడ్డవాళ్లే. కాకపోతే లైట్ తీసుకుని ముందెళ్లడం తప్ప ఎవరైనా ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు.
This post was last modified on August 19, 2023 4:39 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…