బిగ్ బాస్ షో ద్వారా పాపులరైన సోహెల్ ఆడపాదడపా సినిమాలు చేస్తున్నా అవి ప్రేక్షకులకు రిజిస్టర్ కాక ముందే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. మిస్టర్ ప్రెగ్నెంట్ విషయంలో టీమ్ చేసిన ప్రమోషన్ల వల్ల కొత్త రిలీజుల్లో ఇదొకటి ఉందన్న సంగతి జనాలకు తెలిసింది. ఇప్పటిదాకా రాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు శ్రీనివాస్ వింజనం దర్శకత్వం వహించగా అప్పిరెడ్డి నిర్మించారు. మొన్న సాయంత్రం కూకట్పల్లిలో గర్భిణులకు ప్రత్యేక షో వేసి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. మరి నిజంగా మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివరీ విజయవంతంగా జరిగిందా
టాటూలు వేస్తూ జీవనోపాధి సంపాదించుకున్న గౌతమ్(సోహైల్)ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటుంది మహి(రూప). అయితే అమ్మాయిలు ప్రెగ్నెన్సీకి లోనవ్వడం మీద విపరీత భయాలున్న గౌతమ్ అది జరగకూడదని ముందే మహికి కండీషన్ పెడతాడు. అయితే అనుకోకుండా ఆమె గర్భం దాలుస్తుంది. ఒక లేడీ డాక్టర్(సుహాసిని) సహాయంతో భార్యకు బదులుగా తాను ఆ పిండం మోసే బాధ్యతను తీసుకుంటాడు. దీంతో ఈ జంట జీవితం ఊహించని పెను మార్పులు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని దాటుకుని గౌతమ్ చివరికి ఏం చేశాడనేదే కథ
పాయింట్ చాలా విభిన్నంగా అనిపించినా ప్రాక్టికల్ గా ఎంత మాత్రం సాధ్యమయ్యే అవకాశం లేని సబ్జెక్టు తీసుకున్న దర్శకుడు శ్రీనివాస్ దాన్ని ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, ప్రేమకథతో చాలా టైం వేస్ట్ చేసి అసలు ట్విస్టుని ఇంటర్వెల్ నుంచి మొదలుపెట్టాడు. రెండో సగం భావోద్వేగాలు, బ్రహ్మాజీ-సుహాసిని లాంటి సీనియర్ల వల్ల కొంత సేవ్ అయ్యింది కానీ అవసరం లేని విలన్ ఎపిసోడ్ అడ్డంకిగా మారింది. ఆర్టిస్టుల వరకు అందరూ బాగానే చేశారు.. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్సిన సందేశం బాగున్నప్పటికీ కంటెంట్ బ్యాలన్స్ గా చెప్పడంలో తడబడటంతో ఒక మంచి అవకాశం వృథా చేసినట్టు అయ్యింది.
This post was last modified on August 19, 2023 11:18 am
ఏపీకి శుక్రవారం నిజంగా ఓ పండుగే. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పున:ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగవైభవంగా జరగనుంది. ఏపీ…
ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్లలో అజిత్ ఒకడు. తన చివరి చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి అతను రూ.150 కోట్ల…
శత్రు దుర్బేధ్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత్ తన సాధనా సంపత్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్షిపణి పరీక్షా…
సౌత్ ఇండస్ట్రీలో మాస్ గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ నభా నటేష్. కర్ణాటక నుంచి…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి 10 మాసాలు అయిపోయాయి. తాజాగా రాజధాని అమరావతికి పనులను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ…