టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ముందు గుర్తొచ్చే పేరు శ్రీలీల. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ దాకా అందరూ తననే కోరుకుంటున్నారు. రెమ్యునరేషన్ ఎంతైనా సరే ఇచ్చేందుకు నిర్మాతలూ సిద్ధంగా ఉన్నారు. ఇకపై ఈ అమ్మడి నుంచి నాన్ స్టాప్ గా నెలకో సినిమా అభిమానులకు కానుకగా రాబోతున్నాయి. సెప్టెంబర్ 15 రామ్ తో జంటగా నటించిన ‘స్కంద’ మీద ఆల్రెడీ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. లిరికల్ వీడియోల్లో స్టెప్పులు చూసి హైప్ ఇంకాస్త పెరుగుతోంది. వినాయక చవితి పండగను లక్ష్యంగా చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బిజినెస్ క్రేజీగా ఉంది.
అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ వస్తోంది. బాలకృష్ణ-కాజల్ అగర్వాల్ జంటగా నటించగా శ్రీలీల పాత్ర తీరుతెన్నులకు సంబంధించి లీక్ బయటికి రాకుండా అనిల్ రావిపూడి బృందం జాగ్రత్త పడుతోంది. క్యారెక్టర్ ఏదైనా ఇందులోనూ నృత్యాలకు లోటు లేదట. తాజాగా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’కు రిలీజ్ డేట్ గా నవంబర్ 10ని లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ టెంపుల్ థ్రిల్లర్ మీద హైప్ బాగానే ఉంది. డిసెంబర్ 23న నితిన్ తో కలిసి వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ ట్రాడినరీ మేన్’ లో దర్శనమివ్వనుంది.
కొత్త ఏడాది 2024 ప్రారంభం కావడం ఆలస్యం జనవరి 12న ‘గుంటూరు కారం’లో మహేష్ బాబుతో ఆడిపాడటం చూడొచ్చు. పూజా హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీలీలకు దీని సక్సెస్ చాలా కీలకం. టాప్ లీగ్ లో చేరడంతో పాటు పారితోషికం అమాంతం పెరిగిపోతుంది. ఇలా మొత్తం అయిదు నెలలకు గాను అయిదు రిలీజులతో శ్రీలీల క్యాలెండర్ క్రేజీగా ఉంది. ఒకపక్కా షూటింగుల్లో పాల్గొంటూనే వీటికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో భాగం కావాల్సి ఉంటుంది. ధమాకా నుంచి శ్రీలీల ఫ్యాన్స్ గా మారిపోయిన వాళ్లకు ఇక రెగ్యులర్ పండగే.
This post was last modified on August 19, 2023 1:12 am
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…