తెలుగు సినిమాల్లో భక్త కన్నప్పకు ప్రత్యేక స్థానం ఉంది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి లాంటి ఎందరో దేవుళ్ళ మీద లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి కానీ కృష్ణంరాజు పోషించిన కన్నప్పను మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు. పరమ శివ భక్తుడైన ఆ దైవాంశసంభూతుడి కథను దర్శకులు బాపు కంటే గొప్పగా చెప్పలేమేమోనని ముందుకు రాలేదు. కానీ మంచు ఫ్యామిలీ ఆ సవాల్ ని స్వీకరించింది. కన్నప్పను ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటి తరానికి విజువల్ ట్రీట్ రూపంలో అందివ్వాలని నిర్ణయించుకుని ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసింది.
నిజానికీ ప్రాజెక్టు గురించి గతంలో మోహన్ బాబు, విష్ణు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు కానీ ఎంతమేరకు కార్యరూపం దాలుస్తుందనే దాని మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా వాటికి చెక్ పెట్టేశారు. కన్నప్పకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయనకు టీవీ సీరియల్స్ లో చాలా అనుభవముంది. చంద్రకాంత, రజియా సుల్తానా, తెనాలి రామ, చంద్ర నందిని లాంటి ఎన్నో సూపర్ హిట్ సిరీస్ లను అందించారు. అన్నీ ఘన విజయం సాధించినవే. ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించనుంది, బడ్జెట్ వంద కోట్లపైనే ఉంటుందని ఇంతకు ముందే చెప్పారు.
ఇది విష్ణు డ్రీం ప్రాజెక్టు. కృష్ణంరాజుగారు ప్రభాస్ తో చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. తనికెళ్ళ భరణి ఒక వెర్షన్ రాశారని విష్ణు చెప్పాడు కానీ ఇది అదేనా లేక మరొకటి రాసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణుకి జిన్నా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా పూర్తిగా కన్నప్ప కోసమే సిద్ధమయ్యాడు. గ్రాఫిక్స్ కోసం విదేశీ నిపుణుల టీమ్ పని చేయనుందని సమాచారం. కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో కన్నప్పగా వస్తున్న విష్ణు వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on August 18, 2023 5:23 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…