Movie News

మల్టీస్టారర్ మేళాగా కల్కి 2898

ప్రభాస్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ హిస్టరిలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న కల్కి 2898 ఏడిలో మల్టీ స్టారర్ల లిస్టు అంతకంతా పెరుగుతూ పోతోంది. విలన్ గా కమల్ హాసన్ చేరడం ఆల్రెడీ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి లీకులు వింటుంటే గూస్ బంప్స్ ఆగడం లేదు. దీపికా పదుకునే క్యారెక్టర్ రెగ్యులర్ హీరోయిన్ తరహాలో ఉండదనే క్లూ ఆల్రెడీ ఇచ్చేశారు. దిశా పటాని గురించి బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సరే ఇప్పటికే ఈ క్యాస్టింగ్ తో బాప్రే అనుకుంటుండగా ఇప్పుడు మరో క్రేజీ పేరు వాటికి తోడయ్యింది.

కింగ్ అఫ్ కోత ప్రమోషన్లలో భాగంగా కల్కి ప్రస్తావన తెచ్చిన దుల్కర్ సల్మాన్ ఇందులో తాను ఉన్నట్టు ఇన్ డైరెక్ట్ గా చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ తిన్నారు. దర్శకుడు నాగ అశ్విన్ విజన్ ని చూసి అబ్బురపోయానని, ఈ టైంలో ఇంతకన్నా ఏం చెప్పినా సందర్భం కాదని చెప్పి స్మార్ట్ గా తప్పించుకున్నాడు. మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యంలతో ఆడియన్స్ ని ఎలా అయితే థ్రిల్ చేశాడో వాటికి అందనంత స్థాయిలో విజువల్ వండర్ ని తీర్చిదిద్దుతున్నాడని ఊరించాడు. ఇంతకు మించి రాబట్టాలని మీడియా ప్రయత్నించినా దుల్కర్ స్మార్ట్ గా తప్పించుకున్నాడు.

దీన్ని బట్టి కల్కిలో ఊహించని ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయని అర్థమైపోతుంది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ని జాగ్రత్తగా వడబోసి ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకునే పనిలో ఉన్న నాగ అశ్విన్ ముందు ఫిక్స్ చేసుకున్న విడుదల తేదీ జనవరి 12కి కట్టుబడతారా లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది. పరిస్థితి గమనిస్తే వాయిదా తప్పకపోవచ్చనే టాక్ ఉంది కానీ వైజయంతి మూవీస్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ రావడం లేదు. ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ అన్నీ మొదటి భాగానివే. సీక్వెల్ లో ఇంకెన్ని ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నామని కల్కి టీమ్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు.

This post was last modified on August 18, 2023 1:17 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

22 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

36 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

38 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago