Movie News

నేహా శెట్టి.. ఆలౌట్ ఎటాక్

తెలుగు సినిమాల్లోకి పర భాషల నుంచి చాలామంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో జాక్‌పాట్ కొందరికే దక్కుతుంది. ఆ కొంతమంది మాత్రమే హీరోయిన్లుగా ఒక స్థాయి అందుకుంటారు. కొంతమందికి అందంతో పాటు అన్నీ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాదు. కొన్ని సినిమాలు చేసి కనుమరుగైపోతుంటారు. కన్నడ భామ నేహా శెట్టి కూడా ఈ కోవలోకి చేరే అమ్మాయిలాగే కనిపించింది.

స్టార్ హీరోయిన్ కాగల ఫీచర్స్ అన్నీ ఉన్న నేహా.. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేసి మరీ సినిమాల్లోకి రావడం విశేషం. ఐతే తెలుగులో ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు మెహబూబా, గల్లీ రౌడీ డిజాస్టర్లయ్యాయి. దీంతో ఆమె మీద ప్రేక్షకుల దృష్టి పెద్దగా పడలేదు. ఇంకో ఫెయిల్యూర్ వస్తే కనుమరుగైపోయేదేమో. కానీ ‘డీజే టిల్లు’ ఆమె జాతకాన్ని మార్చేసింది. ఈ సినిమాతో నేహా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. వెంటనే అవకాశాలు వరుస కట్టాయి. 

ఐతే నేహాకు వచ్చినవి మరీ పెద్ద ఛాన్సులైతే కాదు. కార్తికేయతో ‘బెదురులంక 2012’.. కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’.. విశ్వక్సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి చిన్న-మీడియం రేంజ్ సినిమాల్లోనే నేహాకు కథానాయికగా అవకాశాలు వచ్చాయి. అలా అని నేహా ఏమీ నిరాశ చెందలేదు. ఉన్న అవకాశాలనే పూర్తిగా వాడుకోవడానికి ఫిక్సయింది. ‘డీజే టిల్లు’తో తనకు గ్లామర్ ఇమేజ్ రావడంతో.. కథానాయికగా నెక్స్స్ లెవెల్‌కు వెళ్లడానికి ఆ ఇమేజ్‌నే ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే ‘రూల్స్ రంజన్’లో సమ్మోహనుడా పాటలో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది నేహా.

‘బెదురులంక’లో సైతం ఆమె చేసింది గ్లామర్ రోలే. ఈ సినిమా ట్రైలర్లోనూ నేహా బాగా హైలైట్ అయింది. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఓ పాట లాంచ్  కాగా అందులో తడి అందాలతో నేహా మత్తెక్కించేసింది. ఈ పాట లాంచ్ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో విశ్వక్సేన్‌తో కలిసి చేసిన ఆన్ స్టేజ్ రొమాన్స్ కూడా హాట్ టాపిక్ అయింది. చూస్తుంటే నేహాది ఆలౌట్ గ్లామర్ ఎటాక్ లాగే కనిపిస్తోంది. మొత్తానికి చిన్న సినిమాలతోనే నేహా ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఈ సినిమాలు క్లిక్ అయ్యాయంటే నేహా కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.

This post was last modified on August 18, 2023 1:05 am

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

2 hours ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

4 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

7 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

8 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

9 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

9 hours ago