వందకు పైగా సినిమాల్లో నటించి శాండల్ వుడ్ లో తిరుగులేని స్టార్ డం సంపాదించుకున్న శివరాజ్ కుమార్ గురించి తెలుగు తమిళ రాష్ట్రాల్లో తెలిసింది తక్కువే. కారణం ఆయన బ్లాక్ బస్టర్లు ఎక్కువ ఇతర హీరోలతో రీమేక్ కావడమే. జైలర్ వచ్చాక లెక్కలు మారిపోయాయి. కనిపించేది కేవలం నిముషాలు మాత్రమే అయినా రజినీకాంత్ కు ఇచ్చిన మాట మీద ఆయన కుటుంబాన్ని కాపాడే చిన్న పవర్ ఫుల్ పాత్ర ఓ రేంజ్ లో పేలింది. అసలు చెయ్యి ఎత్తకుండా, ఊరికే నడుచుకుంటూ వచ్చి ఇంతలా ఆకట్టుకున్న క్యామియో గత కొన్నేళ్లలో ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు.
ఇక విషయానికి వస్తే శివరాజ్ కుమార్ కొత్త ప్యాన్ ఇండియా మూవీ ఘోస్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. జైలర్లో వేసిన నరసింహ క్యారెక్టర్ పుణ్యమాని ఇతర భాషల్లోనూ దీనికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. నాగార్జున టైటిల్ నే మళ్ళీ వాడుకున్నప్పటికీ దీని కంటెంట్ పూర్తిగా వేరు కాబట్టి పోలిక పరంగా ఇబ్బంది రాదనే ధీమాలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే ట్విస్ట్ ఏంటంటే అక్టోబర్ లో దసరా పండగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కర్ణాటకలో ఇబ్బంది లేదు కానీ ఏపీ తెలంగాణ తమిళనాడులో పోటీ దృష్ట్యా పెద్ద రిస్క్ పొంచి ఉంది.
విజయదశమికి బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో ఎవరికెవరం తగ్గేదేలే అంటూ అక్టోబర్ 19, 20 తేదీలను లాక్ చేసుకుని కూర్చున్నాయి. వీటి మధ్యలో ది ఘోస్ట్ రావడమంటే శివన్నకు రిస్కే. అయినా సరే వెనుకడుగు వద్దని చెబుతున్నారట. ఆప్త స్నేహితుడు బాలయ్యతో పోటీ ఎంత వద్దనిపిస్తున్నా మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా దసరా అయితేనే బెస్ట్ అని సన్నిహితులు చెప్పడంతో దానికే మొగ్గు చూపేలా ఉన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ఘోస్ట్ లో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్ లో కరుడుగట్టిన మాఫియా డాన్ గా నటించాడు.
This post was last modified on August 17, 2023 12:55 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…