సూపర్ స్టార్ రజినీకాంత్‌కు నిఖార్సయిన హిట్ వచ్చి చాలా ఏళ్లయిపోయింది. గత పదేళ్లలో ఆయన సినిమా ఏదీ ‘సక్సెస్’ అనిపించుకోలేదు. ‘రోబో’ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురయ్యాయి. 2.0, కబాలి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. అంతిమంగా అవి బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇక మిగతా సినిమాల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. గత కొన్నేళ్లలో వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తె ఒకదాన్ని మించి ఒకటి నిరాశపరిచాయి.
ఇక రజినీ పనైపోయినట్లే అని అంతా తీర్మానించేశారు. ఒకప్పుడు రజినీ సినిమా అంటేనే పూనకాలు తెచ్చుకున్న ఫ్యాన్స్ కూడా చల్లబడిపోయారు. ఇలాంటి టైంలో ‘జైలర్’ మూవీ చేస్తున్న మ్యాజిక్ షాకింగ్ అనే చెప్పాలి. రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఎబోవ్ యావరేజ్ టాక్‌తోనే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. తొలి వీకెండ్లోనే ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు తెచ్చుకుంది ‘జైలర్’.
సౌత్ ఇండియా అంతటా ‘జైలర్’ ప్రభంజనం మామూలుగా లేదు. తమిళంలో ఈ సినిమాకు పోటీగా మరే చిత్రం రిలీజ్ కాలేదు. తెలుగులో ‘భోళా శంకర్’ లాంటి పెద్ద సినిమానే రిలీజైనా కనీస ప్రభావం చూపలేదు. చిరు సినిమా స్క్రీన్లు తీసి రజినీ మూవీకి ఇచ్చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇండిపెండెన్స్ డే సెలవును కూడా ‘భోళా శంకర్’ ఉపయోగించుకునే పరిస్థితి లేదు.
ఈ రోజంతా కూడా ‘జైలర్’ ప్రభంజనమే కొనసాగుతోంది. ఇక రాబోయే వీకెండ్లో కూడా చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. ప్రేమ్ కుమార్, మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి చిన్నా చితకా సినిమాలే వస్తున్నాయి. అవి రజినీ సినిమాను ఆపే పరిస్థితి ఎంతమాత్రం లేదు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ వచ్చే వారం ‘జైలర్’ జోరును ఆపే సినిమాలు లేకపోవడంతో రెండో వారంలో కూడా ‘జైలర్’ సౌత్ ఇండియా అంతటా ప్రభంజనాన్ని కొనసాగించబోతోంది.
This post was last modified on August 16, 2023 9:40 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…