కేవలం ఎన్నికలను ప్రభావితం చేయడానికే వ్యూహం సినిమా తీస్తున్నానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ దానికి అంత సీన్ ఉందో లేదో తెలియదు కానీ టీజర్ల రూపంలో కంటెంట్ మొత్తం ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా వదిలిన వీడియోలో ఏ అంశాలను ఏ కోణంలో చూపించారో వివరించే ప్రయత్నం చేశారు. పావురాల గుట్టలో వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత జగన్ చుట్టూ జరిగిన పరిణామాలను సబ్జెక్టుగా తీసుకున్న వర్మ ఊహించినట్టే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు ఏదో పెద్ద కుట్రలో భాగమైనట్టుగా సన్నివేశాలు పొందుపరిచిన తీరు కనిపిస్తోంది.
సానుభూతి జగన్ వైపు వచ్చేలా చేసెందుకు సోనియా గాంధీ, మన్ మోహన్ సింగ్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులను పోలిన పాత్రలను పెట్టేందుకు వర్మ వెనుకాడలేదు. జగన్ క్యారెక్టర్ చేసిన అజ్మల్ కి మిమిక్రి ద్వారా అచ్చం ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి గొంతులాగే అనిపించేలా డబ్బింగ్ చెప్పించడం సహజత్వం కోసం తాపత్రయపడిన కృత్రిమ ప్రయత్నం. విజువల్స్ అన్నీ ఎప్పటిలాగే వర్మ స్టాండర్డ్ కు తగ్గట్టే తక్కువగా ఉన్నాయి. చిరంజీవిని పోలిన ఆర్టిస్టుతో సహా అందరూ మరీ కృతకంగా ఉన్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది గ్రాండ్ నెస్ కి స్కోప్ లేనప్పుడు.
వ్యూహం వల్ల జగన్ మోహన్ రెడ్డికి జరగబోయే మేలెంతో తెలియదు కానీ ఆయన బ్రాండ్ ని వాడి వర్మ బిజినెస్ చేయబోతున్నాడు. వైఎస్ఆర్ సీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు ఎలాగూ చూస్తారు. ఆవసరమైతే అధిక పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రమోషన్ లో భాగం కావొచ్చు. ఏకంగా జగన్ నే పర్సనల్ గా కలిసి వచ్చి తన ఉద్దేశాలు వివరించిన వర్మ ఇప్పుడీ వ్యూహం ద్వారా తన భక్తిని నిరూపించుకోబోతున్న వైనం స్పష్టం. మానస రాధాకృష్ణన్, ధనుంజయ్, సురభి తదితరులు ఇతర తారాగణం చాలానే ఉంది కానీ ఎవరూ కనీసం గుర్తుపట్టే ఆర్టిస్టులు లేకపోవడం ఫైనల్ ట్విస్టు
This post was last modified on August 15, 2023 1:21 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…