ఎప్పుడో స్టార్ డం తగ్గిపోయి రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్న సన్నీ డియోల్ కు గదర్ 2 రూపంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కింది. ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైం క్లాసిక్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామాకు మాస్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మూడు రోజులకు 134 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లో జనాలు ట్రాక్టర్లు కట్టుకుని మరీ మల్టీప్లెక్సులకు వస్తున్న వీడియోలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. రేపు ఇండిపెండెన్స్ డేకి ఇంకా అరాచకం ఉంటుందని అంచనా.
దర్శకుడు అనిల్ శర్మ టేకింగ్ పరంగా పాత పద్ధతినే ఫాలో అవుతూ, సుదీర్ఘమైన నిడివితో తండ్రి కొడుకుల ఎమోషన్ మీద కథను నడిపినప్పటికీ సగటు ప్రేక్షకులకు ఆ భావోద్వేగాలు బాగా కనెక్ట్ అయ్యాయి. అమీషా పటేల్ నే హీరోయిన్ గా తీసుకోవడం, అప్పటి ఆల్బమ్ లో రెండు ఛార్ట్ బస్టర్స్ ని తిరిగి వాడుకోవడం హైప్ ని పెంచాయి. పోటీకి అక్షయ్ కుమార్ ఉన్నప్పటికీ సన్నీ ఈ రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేయడం చిన్న విషయం కాదు . నిన్న ఆదివారం చాలా చోట్ల షారుఖ్ ఖాన్ పఠాన్ కంటే ఎక్కువ థర్డ్ డే నెంబర్లు వచ్చినట్టు ముంబై టాక్. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగనుంది.
ఒకవేళ ఓ మై గాడ్ 2 లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆల్ టైం రికార్డులు నమోదయ్యేవన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. సోలో హీరోగా సన్నీ డియోల్ సక్సెస్ చూసి ఎంత కాలమయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. స్టార్ హీరోలు ఎంత గ్యాప్ వచ్చినా, ఎంత విరామం తీసుకున్నా సరైన కాంబినేషన్ దొరకాలే కానీ ఏ స్థాయిలో కం బ్యాక్ చేయగలరో గదర్ 2 మరోసారి నిరూపించింది. గత మూడు నాలుగు నెలలుగా రామ్ కామ్ ఎంటర్ టైనర్లతో బోర్ కొట్టేసిన ఉత్తరాది మాస్ కి గదర్ 2 ఎడారిలో పెప్సీ కోలాలా కనిపించింది. ఇంకేముంది పొలోమని అర్ధరాత్రి షోలను కూడా హౌస్ ఫుల్ చేసి పడేస్తున్నారు.
This post was last modified on August 14, 2023 12:56 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…