ఒకప్పుడు కల్ట్ క్లాసిక్ ఫిలిం మేకర్ గా గొప్ప పేరు తెచ్చుకుని ఎందరో గర్వపడే శిష్యులను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఆ వైభవాన్ని పోగొట్టుకుని ఏళ్ళు గడిచిపోయాయి. సి గ్రేడ్ కంటెంట్ తో తన స్థాయికి తగని సినిమాలు తీస్తూ ఇప్పుడు ఏకంగా ఏపీ అధికార పార్టీకి సోషల్ మీడియా క్యాంపైనర్ గా మారిపోయిన వైనం ఆయన్ని విపరీతంగా ఇష్టపడిన వాళ్ళను బాధ పెడుతోంది. సరే ఎవరేం అనుకున్నా నా ధోరణి నాదే నా లోకం నాదేననే వర్మ తాజాగా వ్యూహం తీస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ చనిపోయాక జరిగిన పరిణామాలు ఆధారంగా కథను రాసుకున్నారు.
త్వరలోనే విడుదల కాబోతున్న ఈ వ్యూహం వచ్చే ఏడాది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని వర్మ చెప్పడం కంటే పెద్ద జోక్ మరొకటి ఉండదు. వన్ సైడ్ పొలిటికల్ అజెండాతో సినిమా తీసినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మేసేంత అమాయకత్వంలో ఓటర్లు లేరు. ఇంతకు ముందు దురుద్దేశాలతో తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్, కడప రాజ్యంలో అమ్మ బిడ్డలు, పవర్ స్టార్ లను ఎవరూ పట్టించుకోలేదు. నాసిరకం కంటెంట్ కి ఫ్యాన్సే దండం పెట్టారు. అలాంటిది ఇప్పుడేదో వ్యూహంతో అద్భుతాలు జరిగిపోతాయనే రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం చూస్తే ఇంతకన్నా నవ్వొచ్చే అంశం మరొకటి ఉండదు.
రంగం విలన్ అజ్మల్ ఈ వ్యూహంలో జగన్ మోహన్ రెడ్డిగా నటిస్తున్నాడు. ఇందులోనూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ జగన్ చాలా మంచివాడనే చెప్పే తాపత్రయమే వర్మది. మహి వి రాఘవ యాత్ర 2 కూడా ఇదే బాపతు అయినప్పటికీ కనీసం అందులో మేకింగ్ ఒక స్టాండర్డ్ లో ఉంటుంది. కానీ వర్మ ఏకంగా ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ చూపించే రేంజ్ లో సినిమా తీస్తానని చెప్పడం పట్ల నెటిజెన్లు మంచి జోకులు వేసుకుంటున్నారు. అయినా ఎవరి ఉద్దేశాలేంటో స్పష్టంగా అర్థమవుతున్నప్పడు ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం ద్వారా ఏదో జరుగుతుందనుకోవడం అమాయకత్వమే.
This post was last modified on August 14, 2023 12:19 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…