గత ఏడాది తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ ఏ స్థాయిలో పేలిందో సింపుల్ గా చెప్పడం కష్టం. కేవలం అయిదు నిమిషాల క్యామియోతో తను చేసిన భీభత్సం అంతా ఇంతా కాదు. అప్పటి నుంచే ఈ క్యారెక్టర్ మీద సోలో మూవీ రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన స్పష్టమైన హామీ రాలేదు. ఇప్పుడు హీరో సూర్యనే స్వయంగా ఇది ఎప్పుడు ఉండబోతోందో చెప్పడంతో మూవీ లవర్స్ సంబరపడుతున్నారు
తాజాగా సూర్య చెన్నైలో అభిమానుల సమావేశం ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా సమయం కేటాయించి వాళ్ళతో ముచ్చటించాడు. కంగువాతో పాటు కొన్ని కీలకమైన ముచ్చట్లు పంచుకున్నాడు. అందులో రోలెక్స్ ఒకటి. ఆల్రెడీ లోకేష్ తనకు కథ చెప్పాడని, బాగా నచ్చేసి డెవలప్ చేయమని చెప్పానని, లియో కాగానే ఆ పనే జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న కంగువ తర్వాత వెట్రిమారన్ వడి వాసల్ ని పూర్తి చేయాలి. విడుదల పార్ట్ 2 అయ్యాక దీని చిత్రీకరణ మొదలవుతుంది. నెక్స్ట్ సూర్య 43 ఉంటుంది. రోలెక్స్ తర్వాతే ఇరుంబు కాయ్ మాయావి స్టార్ట్ చేస్తారు.
ఈ లెక్కన 2025లో రోలెక్స్ రావడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే అంతకన్నా ముందే ఉండొచ్చు. కంగువా మీద చాలా నమ్మకంగా ఉన్న సూర్య మీరు ఎంతైనా ఊహించుకుంటే దానికి వంద రెట్లు అధికంగా కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నాడు. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా వచ్చే ఏప్రిల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. రెండు వందల కోట్ల దాకా బడ్జెట్ తో సూర్య కెరీర్లోనే అత్యధికంగా దీనికే ఖర్చు పెడుతున్నారు. మొత్తం పది భాషల్లో ప్యాన్ వరల్డ్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…