టైటిల్ లోనే దేవుడిని పెట్టుకున్నా ఏకంగా ఇరవై ఏడు మార్పులతో అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ అందుకున్న సినిమాగా ఓ మై గాడ్ 2 మీద ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ట్రాక్ రికార్డు పరంగా అక్షయ్ కుమార్ చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పటికీ మొదటి భాగం అందుకున్న సక్సెస్, దాన్ని వివిధ భాషల్లో రీమేక్ చేసిన వైనం సీక్వెల్ మీద బజ్ తీసుకొచ్చింది. సన్నీ డియోల్ గదర్ 2 పోటీ వల్ల ఓపెనింగ్స్ కి ఇబ్బంది పడినప్పటికీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి బుకింగ్స్ విషయంలో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఇంతకీ ఓ మై గాడ్ 2లో అంత చెప్పుకునే విషయం నిజంగా ఉందా
శివభక్తుడైన కాంతి శరణ్(పంకజ్ త్రిపాఠి)గుడి పక్కనే పూజా సామాన్ల దుకాణం నిర్వహిస్తూ ఉంటాడు. ఒకే మగసంతానం, భార్య, తండ్రితో చక్కని కుటుంబం తనది. ఓ రోజు కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్ లో చేసిన నిర్వాకం వల్ల డీబార్ అవుతాడు. అతను చేసిన ఓ అసభ్యకరమైన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊరొదిలి వెళ్లిపోదామనుకున్న కాంతి శరన్ ను దేవుడు పంపిన దూత (అక్షయ్ కుమార్)పరిచయమై కోర్టులో పోరాడేలా ప్రోత్సహిస్తాడు. కేసు రకరకాల మలుపులు తిరిగి తండ్రికొడుకులకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. అసలు స్టోరీ ఇక్కడ షురూ.
దర్శకుడు అమిత్ రాయ్ తీసుకున్న పాయింట్ సెక్స్ ఎడ్యుకేషన్. పిల్లలకు సున్నితమైన విషయాలు చెప్పడంలో సమాజం అనుసరిస్తున్న ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయనే కోణంలో ఓ మై గాడ్ 2ని తీర్చిదిద్దాడు. ఆలోచింపజేసే విషయాలు చాలా ఉన్నాయి. లీడ్ క్యాస్టింగ్ తో పాటు లాయర్ గా యామీ గౌతమ్ పెర్ఫార్మన్స్ సీన్లను పండించింది. అయితే ఫస్ట్ పార్ట్ లాగా ఇందులో ఆ స్థాయి వినోదం లేదు. సెటైరిక్ గా ఉంటూ సీరియస్ ఇష్యూ మీద చర్చిస్తుంది. దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటేనే సినిమాని ఆస్వాదించగలం. సాంప్రదాయ ఆలోచనలున్న ఆడియన్స్ అంత సులభంగా కనెక్ట్ కాలేరు.
This post was last modified on August 12, 2023 7:58 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…