మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు అంతంతమాత్రమే. టీజర్.. ట్రైలర్.. పాటలు ఏవీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. విడుదల ముంగిట కూడా హైప్ రాలేదు. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద గట్టిగానే పడింది. మెగాస్టార్ సినిమాకు మంచి మంచి స్క్రీన్లలో కూడా తొలి రోజు మార్నింగ్ షోలు ఫుల్ కాకపోవడం ‘భోళా శంకర్’కే జరిగింది.
ఇక అతి తక్కువ అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టినా సరే తీవ్ర నిరాశ తప్పని స్థాయిలో సినిమా సాగడంతో మెగా అభిమానులే తట్టుకోలేక నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. సినిమాలో ‘క్రింజ్’ అనిపించే సీన్లకు.. డైలాగులకు లోటే లేదు. చిరంజీవి పెర్ఫామెన్స్.. ఆయన డ్యాన్సులు.. ఫైట్లు కూడా సినిమాను కాపాడే పరిస్థితి లేదని థియేటర్ల నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకుల స్పందనను బట్టి అర్థమవుతోంది.
‘భోళా శంకర్’లో అత్యంత ఇబ్బంది పెట్టిన సన్నివేశం అంటే.. ‘ఖుషి’ నడుము సీన్‌ను రీక్రియేట్ చేసిన ఎపిసోడే. ఇప్పటికే ఆ సన్నివేశాన్ని చాలా చిత్రాల్లో పేరడీ చేయడం చూశాం. అవన్నీ చాలా వరకు కమెడియన్లు చేసినవే. కానీ చిరంజీవి స్థాయికి ఏం అవసరం వచ్చిందని ఈ సీన్‌కు పేరడీ చేయాలనుకున్నారో తెలియదు. పవన్ మెడ రుద్దుకుంటూ హ హ అనే మేనరిజంను అనుకరిస్తూ ఇంతకుముందు ఒక బిట్ వదిలినపుడే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.
చిరు స్థాయికి ఇలాంటివి అవసరమా అని మెగా అభిమానుల నుంచే ప్రశ్నలు తలెత్తాయి. ఇక సినిమాలో అయితే.. ‘ఖుషి’ నడుము సీన్‌నే రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఐతే చాలా ఎబ్బెట్టుగా అనిపించేలా ఆ సీన్ తీయడంతో అదెప్పుడు ముగిసిపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది. చిరు ఈ వయసులో ఇలాంటి సీన్ చేయడం.. అందులో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆయన్ని ఎంతగానో అభిమానించే కుటుంబ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించే అవకాశం లేదు. కనీసం ఫైనల్‌గా సినిమా చూసుకున్న టైంలో అయినా చిరు దీన్ని కట్ చేయించి ఉండాల్సిందేమో.
This post was last modified on August 11, 2023 11:16 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…