Movie News

‘ఆచార్య’ అప్‌డేట్‌పై దోబూచులాట

మెగాస్టార్ చిరంజీవి అభిమానులిప్పుడు ఉత్కంఠతో ఊగిపోతున్నారు. చిరు పుట్టిన రోజుకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉంది. ఈసారి ఆయన పుట్టిన రోజుకు హంగామా మామూలుగా ఉండదని సంకేతాలందుతున్నాయి.

వివిధ సినీ పరిశ్రమల నుంచి 65 మంది ఫిలిం సెలబ్రెటీలతో చిరు పుట్టిన రోజు కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తునే వేడుకలు చేయడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆగస్టు 22న చిరు కొత్త సినిమాల ముచ్చట్లు సందడి చేయబోతున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘ఆచార్య’ నుంచి అభిమానుల్ని అలరించే అప్ డేట్ వస్తుందంటున్నారు. అలాగే చిరు చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా అధికారికంగా వెల్లడిస్తారట.

‘ఆచార్య’ విషయంలో అప్ డేట్ ఏంటన్నదే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న విషయం. టైటిల్ అధికారికంగా ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా లేదా టీజర్ లాంటిదేమైనా ప్లాన్ చేశారా అన్నది తెలియదు. కానీ అప్ డేట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

ఈ సినిమా పట్టాలెక్కి పది నెలలు దాటిన నేపథ్యంలో కచ్చితంగా అప్ డేట్ ఇవ్వాల్సిందే. దీని గురించి ‘ఆచార్య’ నిర్మాణ భాగస్వామి అయిన ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ కూడా ట్విట్టర్లో అభిమానులతో దోబూచులాట ఆడుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాలకు ఆ సంస్థ ఒక ట్వీట్ వేసింది.

‘మాకు ఈ నంబర్ అంటే ఎంతో ఇష్టం’ అని కిందికి చూపిస్తున్న సింబల్ ఉంది ఆ ట్వీట్లో. కింద టైమ్ 1.52 చూపిస్తోంది. ‘ఆచార్య’ చిరు 152వ సినిమా అన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చిరు పుట్టిన రోజున ‘ఆచార్య’ అప్ డేట్ కచ్చితంగా ఉంటుందన్న సంకేతాలు అందుతున్నాయి.

This post was last modified on August 18, 2020 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

22 minutes ago

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

1 hour ago

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

2 hours ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

2 hours ago

బలగం మొగిలయ్య కన్నుమూత

తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…

2 hours ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

5 hours ago