‘అజ్ఞాతవాసి’ తర్వాత రెండేళ్ల పాటు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక దశలో పవన్ తీరు చూస్తే మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా కనిపించింది. కానీ ఎన్నికలు అయిన ఆర్నెల్ల తర్వాత ఆయన మనసు మారింది. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.
ఐతే సినిమాలకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. రాజకీయాల్లో కొనసాగుతూనే రెండేళ్ల వ్యవధిలో వీలు చిక్కినపుడల్లా షూటింగ్‌కు సమయం కేటాయిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నాడు. ఆ ప్రకారమే ముందుగా ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టి శరవేగంగా సినిమాను పూర్తి చేయాలని చూశాడు. కానీ కరోనా వచ్చి ఆయన ప్రయత్నానికి అడ్డం పడింది. మరోవైపు ఒక షెడ్యూల్ తర్వాత క్రిష్ సినిమా కూడా ఆగిపోయింది.
ఇప్పుడిక పవన్ ఎప్పుడు మళ్లీ షూటింగ్‌కు వస్తాడో.. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలా డేట్లు కేటాయిస్తాడో అర్థం కాకుండా ఉంది. మరోవైపు క్రిష్ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. దీంతో పవన్‌తో క్రిష్ సినిమా మీద అయోమయం నెలకొంది. ఈ విషయమై తాజాగా మీడియాకు సమాచారం ఇచ్చాడు క్రిష్.
తనతో పవన్ చేస్తున్న సినిమా విషయంలో తొందర లేదని.. ఆయన ముందు ‘వకీల్ సాబ్’ పూర్తి చేయాలని.. ఆ తర్వాత వీలు చూసుకుని తమ సినిమాను పున:ప్రారంభిస్తామని క్రిష్ వెల్లడించాడు. ఈ లోపు తాను వైష్ణవ్ సినిమాను పూర్తి చేస్తానన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా పవన్‌తో క్రిష్ సినిమాకు సంగీతం అందిస్తున్న కీరవాణే.. వైష్ణవ్-క్రిష్ సినిమాకు కూడా పని చేయనున్నాడన్నది తాజా సమాచారం.
This post was last modified on August 18, 2020 3:13 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…