మాములుగా మనది కాని భాషలో నటించేటప్పుడు హీరో హీరోయిన్లు డబ్బింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోరు. వేరేవాళ్ళతో చెప్పిస్తారని లైట్ తీసుకుని జస్ట్ లిప్ మూమెంట్ తో పని కానిచ్చేస్తారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు సైతం కొందరిలో ఇదే ధోరణి కనిపిస్తుంది. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ విషయంలో చాలా స్పెషల్ అనిపిస్తాడు. స్క్రీన్ వెనుక ఖచ్చితంగా నా గొంతే వినిపించాలనే పట్టుదల ఇతనిది. కనులు కనులను దోచాయంటే లాంటి అనువాద చిత్రమైనా, మహానటి లాంటి స్ట్రెయిట్ మూవీ అయినా ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే వెబ్ సిరీస్ లకు కూడా మినహాయింపు ఇవ్వట్లేదు ఈ కుర్ర హీరో. నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న గన్స్ అండ్ గులాబ్స్ లో తెలుగుతో సహా మిగిలిన లాంగ్వేజెస్ లోనూ తన గాత్రమే అందించాడు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సృష్టికర్తలు రాజ్ అండ్ డికె దీనికి దర్శకత్వం వహించారు. 70 దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా నలుగురు కుర్రాళ్ళ మధ్య క్రైమ్ కామెడీ డ్రామాగా దీన్ని రూపొందించారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. రాజ్ కుమార్ రావు లాంటి వాళ్ళు ఇందులో భాగమయ్యారు. బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి రూపొందించారు.
పొగడటం అని కాదు కానీ దుల్కర్ కు ఈ పట్టుదల తండ్రి మమ్ముట్టి నుంచి వచ్చింది. ఆయన దళపతి, స్వాతి కిరణం, సూర్య పుత్రులు, యాత్ర సినిమాలకు తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పారు తప్పించి ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారని వదిలేయలేదు. ఇప్పుడు వారసుడు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. ఇలా చేయడం వల్ల సహజత్వం పెరిగి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ లో లక్కీ భాస్కర్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో క్రమం తప్పకుండా స్ట్రెయిట్ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
This post was last modified on August 8, 2023 11:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…