మెగా స్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇద్దరూ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. చిరంజీవి ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమాకి ఒక్కరోజు ముందు రజినీ కాంత్ తన ‘జైలర్’ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఉన్నాయి. కాకపోతే భోళా శంకర్ కంటే జైలర్ మీద కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. డానికి రీజన్ నెల్సన్ కట్ చేసిన ట్రైలర్.
ఈ సినిమాలకు బజ్ ఎలా ఉందనేది పక్కన పెడితే , సీనియర్లకి మాత్రం బాగా కలిసొచ్చేలా ఉంది. వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా ఈ మధ్య బాగా డ్రాప్ చూస్తున్నాం. అయితే జైలర్ , భోళా శంకర్ లకు వీకెండ్ తర్వాత ఆగస్ట్ 15 హాలిడే కలిసొచ్చేలా కనిపిస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సోమవారం సెలవు పెట్టుకుంటే వారికి లాంగ్ వీకెండ్ ఉంటుంది. వారికి సినిమా టైమ్ పాస్ కాబట్టి కచ్చితంగా ఆ రెండ్రోజులు ఈ సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇండిపెండెన్స్ డే హాలిడే కాబట్టి ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది.
ఏదేమైనా వీకెండ్ తర్వాత పబ్లిక్ హాలిడే రావడం చిరు , రజినీలకు బాగా కలిసొచ్చే అంశం. ఇక రజినీ నుండి వచ్చిన ప్రీవీయస్ మూవీస్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాయి. చిరు మాత్రం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు భోళా శంకర్ గా రాబోతున్నాడు. మరి ఈ పోటీలో బాక్సాఫీస్ దగ్గర పై చేయి సాదించేది ఎవరో ? చూడాలి.
This post was last modified on August 8, 2023 9:05 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…