ఈ మధ్య సెలబ్రిటీస్ ట్రెండ్ పట్టుకుంటూ సోషల్ మీడియాలో వాడే మాటలను తమ నోటి నుండి చెప్పడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ స్టార్ హీరోలు చెప్తే రీచ్ కూడా అలానే ఉంటుంది. తాజాగా మెగా స్టార్ చిరు కూడా అదే చేశారు. భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీం తో కలిసి చిరు ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో దిల్ రాజు ట్రోలింగ్ కి గురైన ఒకప్పటి మాటలను చిరు చెప్పడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
విజయ్ తో తమిళ్ లో వారిసు అనే సినిమా నిర్మించిన దిల్ రాజు చెన్నై లో ఆ సినిమా ఈవెంట్ లో విజయ్ ఫ్యాన్స్ ను మెప్పించడం కోసం వచ్చి రాని భాషతో ఓ స్పీచ్ ఇచ్చాడు. అందులో అదిదా సార్ అనే వర్డ్ పాపులర్ అయింది. ఆ స్పీచ్ పట్టుకొని దిల్ రాజు ను సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేశారు. అయితే దిల్ రాజు మాట్లాడిన తమిళ్ పదాలను చిరు ఇంటర్వ్యూ లో తన నోటితో చెప్తూ అదిదా సార్ నేనే అంటూ చెప్పుకోవడం దాన్ని ప్రోమోలో రిలీజ్ చేయడంతో చిరు నోట దిల్ రాజు మాట అంటూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక చిరు సినిమా రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉంది. సినిమాకి హైప్ తీసుకొచ్చేందుకు టీం నానా రకాలుగా కష్టపడుతూనే ఉన్నారు. వేదాళం కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు లేవు. బుకింగ్స్ లో కూడా భోళా ఆశించిన స్థాయిలో జోరు చూపించడం లేదు. సినిమా టాక్ మీదే కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి.
This post was last modified on August 8, 2023 6:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…