ఇంకో నాలుగున్నర నెలల్లో 2024 సంక్రాంతి వచ్చేస్తుంది. టాలీవుడ్ కు అత్యంత కీలకమైన ఈ సీజన్ కోసం హీరోలు నిర్మాతలు ఎంతగా తపించిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా పోటీలో ఎవరుంటారనేది మాత్రం అంత సులభంగా తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. ‘ప్రాజెక్ట్ కె’ని జనవరి 12 రిలీజ్ చేస్తామని వైజయంతి గతంలోనే ప్రకటించింది. అయితే షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉంది కాబట్టి అది రాదనే నమ్మకంతో రవితేజ ‘ఈగల్’తో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్'(ప్రచారంలో ఉన్న టైటిల్)లు ముందు జాగ్రత్తగా కర్చీఫ్ వేసి పెట్టాయి .
ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఖచ్చితంగా వచ్చేది లేనిది రేపు హీరో పుట్టినరోజు యూనిట్ వదిలే స్పెషల్ పోస్టర్ లో ఏదైనా క్లారిటీ ఇవ్వొచ్చు. నిర్మాత నాగవంశీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ ఈ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వాయిదాలు, మార్పులు ఎవరినీ నమ్మించేలా లేవు. నవంబర్ లో ఒక స్పష్టత రావొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలంగా రూపొందిన ‘హనుమాన్’ సైతం 12కే రావాలని లాక్ చేసుకుంది. తేజ సజ్జ లాంటి చిన్న హీరో ఉన్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా ధీమాగా ఉన్నాడు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ దింపాలనుకున్నారు అసలింకా షూటింగే మొదలవ్వలేదు.
ఇక్కడ చెప్పిన వాటిలో నూటికి నూరు శాతం ఛాన్స్ ఉన్నది ముందుగా ఈగల్ కు మాత్రమే. ఇది షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తర్వాత హనుమాన్ ఉంది. మిగిలినవి రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండటంతో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. బయ్యర్లు మాత్రం కనీసం రెండు నెలల ముందు చెప్పకపోతే థియేటర్ల సర్దుబాటు ఇబ్బందవుతుందని, నిర్మాతలకు ఇచ్చిన అడ్వాన్సులకు బయట వడ్డీలు ఎప్పటిదాకా కట్టాలో అర్థం కాదని వాపోతున్నారు. ఒకటి రెండు సినిమాలు తప్పుకోవడం ఖరారే కానీ అవేంటనేది తేలాలంటే ఇంకొంత వెయిటింగ్ తప్పదు మరి.
This post was last modified on August 8, 2023 1:13 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…