ప్రభాస్ కొత్త చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది ‘కల్కి 2898 ఏడీ’ మీదే. ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూశాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇది హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని.. ప్రభాస్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో చాన్నాళ్లుగా సందిగ్ధత నెలకొంది. ముందు 2024 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. ఆ డేట్‌ను అందుకోవడం అసాధ్యం అనే సంకేతాలు కనిపించాయి.
2024 వేసవి లేదా ఆ ఏడాది ద్వితీయార్దంలో రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ మధ్యలో సంక్రాంతి డేట్ మీదే టీం దృష్టిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా గందరగోళానికి గురవుతున్నారు. ఐతే ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో దర్శకుడు నాగ్ అశ్వినే స్వయంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ కొంత భాగమే మిగిలి ఉంది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రస్తుతం నా ఏకాగ్రత మొత్తం దాని మీదే ఉంది. ఆ పని పూర్తయ్యాక విడుదల తేదీ గురించి ఆలోచిస్తాం. ఒక మంచి రోజు చూసుకుని నేనే దాని గురించి ప్రకటిస్తా’’ అని పేర్కొన్నాడు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అందరూ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారని.. ఇప్పటి వరకు ప్రభాస్‌ను చూడని లుక్‌లో చూస్తారని.. అందుకోసమైనా ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని.. ఆడియన్స్ ఒక కొత్త అనుభూతిని పొందుతారని నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కమల్ హాసన్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 8, 2023 11:26 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…