Movie News

బాబు ‘బిజినెస్’ మామూలుగా లేదు

టాలీవుడ్లో ఏడాదిగా రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో చూస్తున్నాం. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టిందే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. సరిగ్గా ఏడాది కిందట మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ‘పోకిరి’ సినిమాకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో వందల సంఖ్యలో స్పెషల్ షోలు ప్లాన్ చేయడం.. అవన్నీ చాలా వరకు హౌస్ ఫుల్స్‌తో రన్ కావడం.. వసూళ్లు కోటిన్నర దాటిపోవడం.. థియేటర్ల దగ్గర కొత్త సినిమాలను మించిన హడావుడి కనిపించడం చూసి అందరూ షాకైపోయారు.

పాత సినిమాతో ఇదేం మోత అనుకున్నారు. ఆ తర్వాత వేరే హీరోల ఫ్యాన్స్‌లోనూ ఆశలు పుట్టాయి. ఇలా పలు చిత్రాలు రీ రిలీజ్‌లో వసూళ్ల మోత మోగించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, ఖుషి సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాయి. రీ రిలీజ్‌లో చాలా వరకు రికార్డులన్నీ పవన్ సినిమాల మీదే ఉన్నాయిప్పుడు.

ఐతే మహేష్ అభిమానులు మళ్లీ రికార్డులు తిరగరాసే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నారు. ఈసారి సూపర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘బిజినెస్‌మేన్’ రీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. మహేష్ సినిమాల్లో అభిమానులు అత్యంత నచ్చే చిత్రాల్లో ఇదొకటి. ఇందులో మహేష్ పాత్ర.. దాని చిత్రణ.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్.. డైలాగులు.. ఇవన్నీ ఒక రేంజిలో ఉంటాయి. థియేటర్లలో అభిమానుల సందడిని పీక్స్‌కు తీసుకెళ్లే స్కోప్ ఉన్న సినిమా ఇది.

రిలీజ్ ప్లానింగ్ భారీగానే జరగడం.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో నడుస్తుండటంతో రీరిలీజ్‌ రికార్డులన్నీ బద్దలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం హైదరాబాద్‌లోనే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆల్రెడీ ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందంటే ‘బిజినెస్ మేన్’ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రీ రిలీజ్‌లో ఫుల్ రన్ అయ్యేలోపు మహేష్ సినిమా ఇంకెంత సంచలనం రేపుతుందో చూడాలి.

This post was last modified on August 8, 2023 10:36 am

Share

Recent Posts

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

34 minutes ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

5 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

6 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

10 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

10 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

12 hours ago