Movie News

తుస్సుమనిపించిన తిమింగలం సినిమా

గత నెల ఇండియన్ బాక్సాఫీస్ హాలీవుడ్ మూవీస్ కి బాగా కలిసి వచ్చింది. ఓపెన్ హెయిమర్ భారీ వసూళ్లతో విరుచుకుపడగా మిషన్ ఇంపాజిబుల్ 7 మంచి రెవిన్యూలతో సేఫ్ అయ్యింది. బార్బీని సైతం అర్బన్ సెంటర్ జనాలు బాగా ఆదరించారు. ఈ మూడు సినిమాలే రెండు వందల కోట్లకు పైగానే వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఈ ఊపులో మెగ్ 2 ది ట్రెంచ్ అనే మరో సినిమా మొన్న శుక్రవారం విడుదలయ్యింది. మన దేశంలో చెప్పుకోదగ్గ వేరే రిలీజులు లేకపోవడంతో ఆడియన్స్ దీని మీద ఓ లుక్ వేద్దామనుకున్నారు. త్రీడితో పాటు ఐమ్యాక్స్ వెర్షన్ ను కూడా విడుదల చేశారు.

ఇది 2018లో వచ్చిన సూపర్ హిట్ మెగ్ కి కొనసాగింపు. స్టార్ హీరో జాసన్ స్టాతమ్ ఈ సీక్వెల్ లోనూ నటించాడు. సముద్ర గర్భంలో ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తూ కొత్త జాతులను కనుక్కునేందుకు దిగిన కొన్ని కార్పొరేట్ శక్తులకు ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. దీంతో రంగంలోకి దిగిన జోనస్ టేలర్ ప్రాణాంతకమైన షార్క్ లను ఎలా అంతమొందించాడనే పాయింట్ మీద దర్శకుడు బెన్ వీట్లీ మెగ్ 2ని రూపొందించాడు. అయితే ఈసారి వెరైటీగా ఉంటుందని డైనోసార్లను తీసుకొచ్చి కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశారు కానీ అది నెరవేరలేదు.

ఇంట్రో సీన్ ని బాగా డిజైన్ చేసినా ఆ తర్వాత క్రమంగా గ్రాఫ్ కిందకు వెళ్ళిపోయి చివరికి సీరియస్ గా ఉండాల్సిన క్లైమాక్స్ ని నవ్వులాటగా మార్చేశారు. రాకాసి బల్లులు, షార్క్ ల మధ్య ఏదో భీకర యుద్ధాలను ఊహించుకుంటే పప్పులో కాలేసినట్టే. అలాంటివి ఏమీ లేవు. జాసన్ తిమింగలాన్ని హతమార్చే ఎపిసోడ్ కూడా మన తెలుగు సినిమా స్టైల్ లో మాస్ గా పెట్టారు కానీ అది కూడా కామెడీ అయిపోయింది. అండర్ వాటర్ సన్నివేశాలు ఓవర్ ల్యాగ్ అయిపోయాయి. ఎంత ఓపిక ఉన్నా సరే ఇదేం సినిమారా బాబు అనుకునేలా ఫైనల్ గా తిమింగలం సినిమా తుస్సుమనిపించేసింది.

This post was last modified on August 7, 2023 6:09 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago