సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మీద అంచనాలు మాములుగా ఎగబాకడం లేదు. కావాలయ్యా పాట, ట్రైలర్ వచ్చిన స్పందన హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఒక్క బెంగళూరు ప్రాంతంలోనే రిలీజ్ ఇంకా మూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 కోట్లకు పైగా వసూలు కావడం కొత్త రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా షెడ్యూల్ చేసిన 903 షోలకు గాను 75 వేల టికెట్లు అమ్ముడుపోగా ఎల్లుండి ఉదయానికి ఈ నెంబర్లు రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని మల్టీప్లెక్సులు అత్యథికంగా ఒక రిక్లైనర్ కు 1400 రూపాయలు అమ్మినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు.
దెబ్బకు భోళా శంకర్ తో పాటు గదర్ 2, ఓ మై గాడ్ 2 బుకింగ్స్ మరీ నెమ్మదిగా కదలడం అసలు ట్విస్టు. కన్నడనేలపై చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉన్నా వేదాళం రీమేక్ అనే పాయింట్ జనంలో ఎగ్జైట్ మెంట్ ని తగ్గించేసింది. జైలర్ ఖచ్చితంగా బాగుంటుందనే ప్రీ టాక్ సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. దాని ఫలితంగానే అమ్మకాలు బాగున్నాయని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. చెన్నైలో తెల్లవారుఝామున స్పెషల్ షోలు ఉంటాయో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ బెంగళూరులో మాత్రం అయిదు గంటల షోలు అప్పుడే సోల్డ్ అవుట్ బోర్డులు పెడుతున్నాయి .
చాలా కాలంగా బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ కు జైలర్ సక్సెస్ చాలా కీలకం. పెద్దన్న, పేట, కాల, కబాలి లాంటివి ఒరిజినల్ వెర్షన్లు కమర్షియల్ గా ఎంత పే చేసినా బయట రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టరయ్యాయి. అందుకే జైలర్ కనక హిట్టు కొడితే తిరిగి తన మార్కెట్ ని సాధించుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. బీస్ట్ ఫ్లాప్ అయినా దర్శకుఢు నెల్సన్ దిలీప్ కుమార్ బ్రాండ్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కొడుకుని కిడ్నాప్ చేసిన ఒక కరుడు గట్టిన ముఠాతో పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ నటించిన జైలర్ అంచనాల బరువుని మోసిందో లేదో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on August 7, 2023 3:50 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…