మెగా బ్రదర్స్ వరసగా రీమేకులు చేయడం పట్ల అభిమానుల్లో ఉన్న అసంతృప్తి చిరు పవన్ లకు తెలియనిది కాదు. తమ్ముడంటే సీరియస్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి కథల గురించి ఆలోచించే టైం లేదు కానీ అన్నయ్యకు ఇండస్ట్రీనే ప్రపంచం కనక విశ్లేషించుకోవడానికి తగినంత సమయం ఉంది. అయినా సరే కంబ్యాక్ ఇచ్చాక మూడో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల సోషల్ మీడియాలో కూసింత నెగిటివిటీ ఎక్కువగానే ఉంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చే ప్రయత్నం చేశారు మెగాస్టార్. అందులో కొంత లాజిక్ ఉన్న మాట వాస్తవమే.
అజిత్ వేదాళం ఏ ఓటిటిలో లేదు కాబట్టి పెద్దగా ఎవరూ చూసుండరని నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్ చెప్పడం వల్లే తాను ఒప్పుకున్నానని చిరు చెప్పారు. అది కూడా బాగా నచ్చబట్టే. అయితే ఇక్క మిస్ అవుతున్న పాయింట్ ఒకటుంది. వేదాళం ఇప్పుడంటే ఆన్ లైన్ లో లేదు కానీ రిలీజ్ టైంలో, తర్వాత యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ వెర్షన్ ని కోట్ల మంది చూసేశారు. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు పైరసీ హిచ్డి ప్రింట్లను డౌన్లోడ్ చేసుకుని మరీ చూశారు. గూగుల్ లో ఈ సినిమా పేరు కొట్టి రివ్యూలు వెతికితే పూర్తి కథతో పాటు ప్లస్సులు మైనస్సులు అన్నీ కనిపిస్తాయి.
ఎప్పుడో హిట్లర్, ఘరానా మొగుడు టైంలో ఇలాంటి సౌలభ్యం లేదు కాబట్టి ఇది సమస్య కాలేదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ బాగా తెలివి మీరిపోయారు. జస్ట్ లీక్ వస్తే చాలు వెతికి మరీ తమిళ మలయాళం సినిమాలు చూస్తున్నారు. కాబట్టి వేదాళం గురించి అసలెవరికీ పెద్దగా తెలియదనుకోవడం పొరపాటే అవుతుంది. ప్రమోషన్లు విస్తృతంగా చేస్తున్నా సరే భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. ఓవర్సీస్ లో రజనీకాంత్ జైలర్ ఆధిపత్యం పూర్తిగా కనిపిస్తోంది. ఉదయం ఆటకు వాల్తేరు వీరయ్య రేంజ్ లో టాక్ వస్తే హిట్టవుతుందనే నమ్మకం పెట్టుకోవచ్చు. చూద్దాం.
This post was last modified on August 7, 2023 1:25 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…