బ్రో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదనే సంగతి పక్కనపెడితే రాజకీయ పరంగా మాత్రం పెను దుమారమే రేపింది. తనను ఉద్దేశించే శ్యామ్ బాబు పాత్రను పెట్టి డాన్స్ చేయించారని మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దానికి ప్రతిగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్వీట్ వార్నింగ్ సైతం అభిమానులకు బాగా వెళ్ళింది. ఒకటి రెండు డైలాగులు, సీన్ కే ఇంత రచ్చ జరిగితే సినిమా మొత్తంలో అవే ఉంటే ఇక జరగబోయే అరాచకం గురించి వేరే చెప్పాలా. ఊహించుకోనవసరం లేదు. నిజంగానే జరగబోతోంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో బోలెడన్ని పొలిటికల్ సెటైర్లు, పంచులు ఉంటాయని గత రెండు రోజులుగా వినిపిస్తూనే ఉంది. దీన్నే ఉటంకిస్తూ మన వెబ్ సైట్ వేసిన ట్వీట్ కి స్వయనా డైరెక్టరే స్పందిస్తూ ఖచ్చితంగా పెడుతున్నాననే హామీ ఇచ్చేలా ఖుషి సినిమాలో పవన్ కాలర్ రుద్దుకునే ఇమేజ్ ఒకటి రీ ట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. ఒకవేళ అలాంటి కంటెంట్ లేకపోతే హరీష్ శంకర్ స్పందించేవారు కాదు. కానీ రెస్పాన్స్ వచ్చిందంటే మాత్రం మాటలతో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. రీమేక్ అయినా సరే హరీష్ శంకర్ మీద నమ్మకం అలాంటిది. ఇప్పటిదాకా కేవలం కొంత భాగం షూటింగే జరిగినప్పటికీ జనసేన వారాహి యాత్రకు బ్రేక్ దొరగ్గానే ముందుగా దీనికే డేట్లు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్టుగా వచ్చిన వార్త అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ పోలీస్ ఎంటర్ టైనర్ కి ఇంకా రెండో కథానాయిక ఎంపిక కావాల్సి ఉంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ నెలలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేయబోతున్నట్టు తెలిసింది.