ఎప్పుడో పదేళ్ల కిందట దర్శకత్వానికి గుడ్ బై చెప్పిన మెహర్ రమేష్ కు ఇంత గ్యాప్ తర్వాత చిరంజీవి భోళా శంకర్ రావడం అదృష్టమే. ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడో లేక చిరుతో ఉన్న సంబంధ బాంధవ్యాల వల్లో ఏదైతేనేం మెగా ఛాన్స్ అయితే కొట్టేశాడు. అయితే తన పేరే ఈ సినిమా బజ్ విషయంలో కొంత నెగటివ్ గా ఉన్న మాట వాస్తవం. శక్తి, షాడో వల్ల వచ్చిన ముప్పిది. సరే ఇంకో వారం ఆగితే ఫలితం తేలిపోతుంది కానీ ఆల్రెడీ తన నెక్స్ట్ మూవీకి మెహర్ పక్కా స్కెచ్ తో రెడీగా ఉన్నాడని టాక్. భోళా షూటింగ్ జరుగుతున్న టైంలో కీర్తి సురేష్ కి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ కథ చెప్పాడట.
లైన్ నచ్చడంతో పాటు అందులో మరో హీరోయిన్ కి స్కోప్ ఉండటంతో అదేదో ఆల్రెడీ కెమిస్ట్రీ బాగా సెట్ అయిపోయిన తమన్నానే తీసుకోమని కీర్తి సురేష్ చెప్పిందని వినికిడి. కాకపోతే ఫైనల్ వెర్షన్ అయ్యాక అప్పుడు నిర్ణయం తీసుకుందామని అనుకున్నారట. ఒకవేళ భోళా శంకర్ పెద్ద హిట్ అయితే మెహర్ కు ఈ ప్రాజెక్టు దారి సుగమం అవుతుంది. లేదూ ఏదైనా తేడా కొట్టిందంటే షరా మాములే. మళ్ళీ పూర్వాశ్రమంకు వెళ్ళిపోవాలి. బహుశా కీర్తి సురేష్ అందుకే రిజల్ట్ వచ్చాక చూద్దాంలెమ్మని పెండింగ్ లో పెట్టి ఉండొచ్చు. ఇదంతా లీకుల రూపంలో బయటికి వచ్చిన టాక్.
అంచనాల సంగతి ఎలా ఉన్నా భోళా శంకర్ బజ్ కోసం పోరాడుతోంది. ట్రైలర్ రొటీన్ గానే అనిపించింది. పాటలు అంతగా ఎక్కలేదు. ప్రొడక్షన్ కలర్ ఫుల్ గా ఉండటం తప్పించి స్టోరీ, టేకింగ్ పరంగా అంతా రెగ్యులర్ ఫార్ములానే. వాల్తేరు వీరయ్య లాగా ఇది కూడా సర్ప్రైజ్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి లేదు. మంగళవారం వచ్చే ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకుని లాంగ్ వీకెండ్ కోసం ఆగస్ట్ 11న వస్తున్న భోళా శంకర్ కు జైలర్, గదర్ 2, ఓ మై గాడ్ 2 పోటీపరంగా స్వాగతం చెబుతున్నారు. మరి మెహర్ ఏమైనా మేజిక్ చేయగలడా చూద్దాం.
This post was last modified on August 4, 2023 5:20 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…