Movie News

తెలుగువాళ్ళ సినిమా ప్రేమకు హద్దులుండవ్

హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ఎందరో స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఐకానిక్ ప్లేస్. ఎన్నో బ్లాక్ బస్టర్లకు తిరుగులేని రికార్డులున్నాయి. దీని కెపాసిటీ 1216 సీట్లు. ఏపీ తెలంగాణలో ఇంత పెద్ద ప్రాంగణాలను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలు. అలాంటి చోట ఇంకా ఆఫీస్ అవర్స్ కూడా మొదలుకాని టైంలో ఈ హాలు హౌస్ ఫుల్ అయ్యిందంటే ఏదో స్టార్ హీరో పెద్ద సినిమా కొత్త రిలీజ్ అయితే తప్ప సాధ్యం కాదు. అలాంటిది ఒక అనువాద చిత్రానికి అది కూడా 15 ఏళ్ళ క్రితం వచ్చిన పాత మూవీకి ఇలాంటి హాజరంటే ఆశ్చర్యమే.

ఇవాళ రీ రిలీజ్ జరుపుకున్న సూర్య సన్ అఫ్ కృష్ణన్ కి అభిమానులతో పాటు యూత్ పోటెత్తుతున్నారు. సూర్యని ఎందుకు తెలుగువాళ్ళ దత్తపుత్రుడని ప్రేమతో అంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాలో సూర్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ఇది గజిని రేంజ్ విజయం సాధించలేదు. తర్వాత కల్ట్ స్టేటస్ వచ్చింది. కానీ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ పాటలు ఊపేసాయి. ఆ సమయంలో దీని విలువని గుర్తించని యువత మధ్య వయసుకు వచ్చాక అరెరే అపార్థం చేసుకున్నామే అనుకున్నారు. కానీ కొత్త జనరేషన్ కి ఇది ఫెవరెట్.

ఇక్కడొకటే కాదు వైజాగ్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ ఇంచు మించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆరంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి రెస్పాన్స్ దీనికే చూస్తున్నామని ఎగ్జిబిటర్ల టాక్. రేపటి నుంచి అదనంగా మరో 50 స్క్రీన్లు పెంచబోతున్నారు. విచిత్రంగా ఇవాళ తొమ్మిది తెలుగు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో దేనికీ కనీస స్పందన లేదు. కొన్ని ఏకంగా మార్నింగ్ షోలే క్యాన్సిల్ చేసుకునేంత దారుణంగా బజ్ తెచ్చుకున్నాయి. కానీ సూర్య సన్ అఫ్ కృష్ణన్ మాత్రం దీనికి భిన్నంగా కాసిన్ని రికార్డులు నెలకొల్పేలా ఉంది. దెబ్బకు తమిళ వెర్షన్ కూడా రీరిలీజ్ చేయమనే డిమాండ్ మొదలవ్వడం విశేషం. తెలుగువాళ్ళ సినిమా పిచ్చి కాదు ప్రేమ ఇలాగే ఉంటుంది. 

Share

Recent Posts

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

3 minutes ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

34 minutes ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

1 hour ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

2 hours ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

3 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

4 hours ago