సరిగ్గా వారం రోజుల్లో రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కోసం అభిమానులు రెడీ అవుతున్నారు. గుంటూరు కారం నుంచి టీజర్, ఆడియో సింగల్ లాంటివి వచ్చే సూచనలు లేకపోవడంతో బిజినెస్ మెన్ రీ రిలీజ్ ని ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళ కసి ఏ స్థాయిలో ఉందంటే ఆగస్ట్ 9 సంబంధించి ఆన్ లైన్ బుకింగ్స్ పెట్టడం ఆలస్యం క్షణాల్లో కొనేసుకుంటున్నారు. అలా అని థియేటర్ యాజమాన్యాలు బ్లాక్ చేయడం లాంటివేవీ లేవు. నిజంగానే ఫ్యాన్స్ ఎగబడి కొంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కాకినాడ అన్ని చోట్ల ఇదే పరిస్థితి.
మహేష్ కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే బిజినెస్ మెన్ పాటలకు, కల్ట్ డైలాగులకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. పోకిరి తర్వాత పూరి జగన్నాధ్ తమ హీరోని పక్కా మాస్ మాఫియా క్యారెక్టర్ లో చూపించాడని తెగ మురిసిపోయి చెప్పుకుంటారు. తమన్ పాటలు, కాజల్ అగర్వాల్ గ్లామర్ లాంటి ఎన్నో ఆకర్షణలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. యూట్యూబ్, ఓటిటి, ఆన్ లైన్లో అందుబాటులో ఉన్న సినిమాను కూడా ఈ స్థాయిలో చూసేందుకు ముందుకు రావడం నిజంగా విశేషమే. చాలా సెంటర్లలో స్క్రీన్లు పెంచే పనిలో బయ్యర్లు, వాళ్ళను ఫాలోఅప్ చేస్తున్న ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు.
మొదటి రోజు రికార్డుల మీద మహేష్ అభిమానులు కన్నేశారు. థియేటర్లు తగినన్ని అందుబాటులో అయితే ఉన్నాయి. బ్రో, బేబీలు నెమ్మదించడం వల్ల సాధారణ ప్రేక్షకులకు సైతం పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. 10న జైలర్, 11న భోళా శంకర్ తో పాటు మరో రెండు హిందీ సినిమాలు వస్తున్న నేపథ్యంలో బిజినెస్ మెన్ కి ఫస్ట్ డే కీలకం కానుంది. సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ షోల తాలూకు హౌస్ ఫుల్ స్టేటస్ లు, అదనపు షోల వివరాలు అప్డేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మాములు కసి అని మాత్రం అనలేం.
This post was last modified on August 2, 2023 6:02 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…