పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో తనను కించపరిచేలా ఒక డ్యాన్స్ పెట్టారని ఏపీ వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు.. గత రెండు రోజులుగా వరుస మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. “ఆయనొక ఎన్నారై. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్ ద్వారా అందిస్తున్నాడు” అని అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే.. మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. అసలు ఈ సినిమాకు, అంబటికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్రకు మంత్రి అంబటి రాంబాబుకు పోలికే లేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. అసలు శ్యాంబాబు డాన్స్‌కు సంక్రాంతి సంబరాల్లో రాంబాబు వేసిన డాన్స్‌కు సింకే లేదని అన్నారు. శ్యాంబాబు రాజకీయ నాయకుడు కాదని, మ్యూజిక్ ఒక్కటి కాదని.. అన్నీ తేడాగానే ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఒక్క టీ-షర్ట్ మ్యాచ్ అవుతుందని.. దాన్ని పట్టుకుని వివాదం చేయడం కరెక్ట్ కాదన్నారు.
ఒకవేళ మంత్రి రాంబాబు తనను కించపరచడానికే ఈ పాత్ర చేశారని ఆయన అనుకుంటే తామేం చేయలేమని నిర్మాత అన్నారు. మంత్రి చేసే ఆరోపణలు తమ చిత్ర ప్రచారానికే ఉపయోగపడతాయని.. తద్వారా తమకు కలెక్షన్లుకూడా పెరుగాయని వ్యాఖ్యానించారు. లేదంటే అంబటి చేసిన వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ కెరీర్‌కు హెల్ప్ అవుతాయని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డా రు. గతంలో ఎన్నో సినిమాలు రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని వచ్చాయని.. కానీ, తమకు ఇప్పుడు ఆ అవసరం లేదన్నా రు. ప్రజలకు అన్నీ తెలుసునని.. సినిమాల్లో చూపించినవన్నీ నిజమేనని ప్రజలు అనుకుంటే.. వేరేగా ఉంటుందని కూడా చెప్పారు. ఇకనైనా అంబటి తన విమర్శలు మానుకోవాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates