ఈ నెల 11న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మీద పెద్ద చర్చే నడుస్తోంది. కంటెంట్ పట్ల సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరుణంలో వాటికి ఎక్కువ కోత వేయడం ఇష్టం లేని నిర్మాతలు ఫైనల్ గా అడల్ట్స్ ఓన్లీ A సర్టిఫికెట్ వైపే మొగ్గు చూపడం ట్రేడ్ ని షాక్ కి గురి చేస్తోంది. ఎందుకంటే సింగల్ స్క్రీన్స్ లో ఏమో కానీ మల్టీప్లెక్సులు ఈ నిబంధనని కఠినంగా పాటిస్తాయి. టికెట్ కొన్నా సరే 18 వయసు లోపు టీనేజర్స్, పిల్లలని నెత్తి నోరు బాదుకున్నా అనుమతించవు. అది తెలిసి దూరమయ్యే కుటుంబ ప్రేక్షకులు లక్షల్లో ఉంటారనేది వాస్తవం.
మొత్తం 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న ఓ మై గాడ్ కు మొత్తం 27 కట్లు, మ్యూట్లు, ఎడిటింగ్లు రికమండ్ చేయగా వాటికి దర్శక నిర్మాతలు ఒప్పుకున్నారు. వాటిలో కొన్ని బూతులు, పాత్రలు చేసిన ఎక్స్ పోజింగ్ బిట్లు, అభ్యంతరకరం అనిపించే మాటలు ఉన్నాయి. కొన్ని కత్తెర వేయగా కొన్ని సంభాషణలు డబ్బింగ్ లో మార్చేశారు. నిజానికి ఈ అబ్జెక్షన్ల వల్లే రిలీజ్ వాయిదా వేయాలనే ఆలోచన కూడా ఒక దశలో జరిగింది కానీ మంచి హాలిడే ప్లస్ లాంగ్ వీకెండ్ ని వదులుకోవడం ఇష్టం లేని ఓ మై గాడ్ బృందం ఆఘమేఘాల మీద ఈ ఒత్తిడినంతా దాటుకుని పూర్తి చేసుకుంది.
అదే రోజు వస్తున్న సన్నీ డియోల్ గదర్ 2 నుంచి అక్షయ్ టీమ్ కి పెద్ద పోటీ స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతానికి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానికి టాక్ తో సంబంధం మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో వెరైటీ అండ్ మాస్ కథలతో రూపొందిన ఓ మై గాడ్ 2, గదర్ 2 లకు అంతకన్నా ఆదరణ దక్కుతుందని బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. రజనీకాంత్ జైలర్ కూడా హిందీ డబ్బింగ్ తో వస్తున్నప్పటికీ నార్త్ జనాలు దేనికి ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసలే అక్షయ్ మార్కెట్ డౌన్ లో ఉండగా, సన్నీ డియోల్ మెయిన్ స్ట్రీమ్ లో లేరు. సక్సెస్ కొట్టడం ఇద్దరికీ చాలా కీలకమే కాదు అవసరం కూడా.
This post was last modified on August 1, 2023 6:00 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…