కొన్నేళ్ల క్రితం వచ్చిన ఫ్లాపులు, డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ పుణ్యమాని మంచి డబ్బులు చేసుకుంటున్నాయి. ఆ మధ్య ధనుష్ 3ని ఇలాగే విడుదల చేస్తే యూత్ ఎగబడి చూశారు. వారం దాకా ఆడిస్తే హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాల వర్షం కురిసింది. నాగబాబుని నష్టాలపాలు చేసిన ఆరంజ్ ని వదిలితే జనసేనకు ఏకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. రెబెల్ కూడా కొన్ని చోట్ల మంచి ఫిగర్లు నమోదు చేసింది. ఇప్పుడు సూర్య సన్ అఫ్ కృష్ణన్ వస్తోంది. ఆగస్ట్ 4న తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
విచిత్రమేంటంటే 2008లో ఇది ఒరిజినల్ గా వచ్చినప్పుడు కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. గజిని లాంటి యాక్షన్ థ్రిల్లర్స్ లో చూసిన సూర్యని వివిధ వయసుల్లో దర్శకుడు గౌతమ్ మీనన్ స్లో టేకింగ్ లో చూడటం తెలుగు ప్రేక్షకులు భారంగా ఫీలయ్యారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. టీవీ, డివిడి, యూట్యూబ్, ఓటిటిలో వచ్చాక క్రమంగా కల్ట్ స్టేటస్ రావడం మొదలయ్యింది. అప్పట్లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని మిస్ చేసిన వాళ్ళు ఇప్పుడు చూసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఉదయం 8 గంటల షోలు పెడుతున్నా ఫుల్ అవుతున్నాయి.
హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో బుకింగ్స్ ఊపందుకున్నాయి. నిజానికి గత నెల సూర్య పుట్టినరోజుకు ప్లాన్ చేసినప్పటికీ కొత్త సినిమాలు విపరీతంగా ఉండటంతో స్క్రీన్ల కొరత వల్ల వెనక్కు తగ్గారు. ఇప్పుడా సమస్య లేదు. బ్రో నెమ్మదించింది. బేబీ ఊపు తగ్గింది. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సో సహజంగానే సూర్య సన్ అఫ్ కృష్ణన్ వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు. వచ్చే వారం 9న మహేష్ బాబు బిజినెస్ మెన్ రాబోతున్న నేపథ్యంలో ఆగస్ట్ నెల తొలి పది రోజులు వీళ్లిద్దరే వాడుకునేలా ఉన్నారు. పదిహేనేళ్ల తర్వాత ఫ్లాప్ మూవీకి ఈ స్థాయి రెస్పాన్స్ విశేషమే.
This post was last modified on August 1, 2023 1:57 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…