చంద్రముఖి-2.. ఈ వినాయక చవితికి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న చిత్రం. ‘చంద్రముఖి’ పేరెత్తగానే ఈ రెండు భాషల ప్రేక్షకులకు ఒక పులకింత కలుగుతుంది. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ హార్రర్ థ్రిల్లర్స్‌లో ఆ చిత్రాన్ని ఒకటిగా చెప్పొచ్చు. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ పంచిన వినోదం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రేక్షకులను భయపెడుతూ.. థ్రిల్ చేస్తూ.. ఆ సినిమా నవ్వించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాకు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ‘చంద్రముఖి’ తర్వాత ఊపందుకున్న హార్రర్ కామెడీ ట్రెండును బాగా ఉపయోగించుకుని ‘కాంఛన’ సిరీస్‌లో వరుసగా సినిమాలు చేసిన నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి-2’లో హీరోగా నటించాడు. ఈ రోజే ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయింది.
‘చంద్రముఖి’లో రాజుగా రజినీకాంత్ పాత్ర, లుక్‌ను గుర్తుకు చేసేలా కనిపించాడు లారెన్స్ ‘చంద్రముఖి-2’ ఫస్ట్ లుక్‌లో. రాజుగా రజినీలో ఉన్న రాజసం, చరిష్మా అయితే లారెన్స్‌లో కనిపించలేదు. ఫస్ట్ లుక్ ఏమాత్రం కొత్తగా కూడా అనిపించలేదు. అసలు రజినీని లారెన్స్ ఏ రకంగా అయినా మ్యాచ్ చేయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రజినీని చూసిన కళ్లతో ఇప్పుడు ‘చంద్రముఖి-2’లో లారెన్స్ చూసి ఎంటర్టైనర్ కాగలమా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ‘చంద్రముఖి’ దర్శకుడు పి.వాసునే రూపొందిస్తున్నాడు.
ఆయన తెలుగులో చంద్రముఖి సీక్వెల్ ఎప్పుడో తీసేశాడు. అదే.. నాగవల్లి. అదొక పెద్ద డిజాస్టర్ అయింది. మళ్లీ ఇప్పుడు తమిళంలో వేరేగా సీక్వెల్ తీయడం.. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలు హార్రర్ కామెడీ జానరే ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయింది కూడా. మరి లారెన్స్-పి.వాసు కలిసి ఇప్పుడీ చిత్రంతో ఏమాత్రం మెప్పిస్తారో చూడాలి. ఈ చిత్రానికి తెలుగు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.
This post was last modified on July 31, 2023 7:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…