సోషల్ మీడియా జనాలను ఎప్పుడు ఏది ఎలా ఆకర్షిస్తుందో.. ఏది ట్రెండింగ్ టాపిక్ అవుతుందో ఊహించలేం. ఇక్కడ సినిమాలకు పని చేసే ప్రొఫెషనల్స్‌ను మించిన వీడియో ఎడిటర్లు ఉంటారు. వాళ్ల పనితనం చూస్తే ఔరా అనిపించకమానదు. ఎక్కడ్నుంచి వస్తుంది ఇంత క్రియేటివిటీ అనిపించేలా మీమర్స్ చేసే అద్భుతాలకు సెలబ్రెటీలు సైతం కొన్నిసార్లు షాకవుతుంటారు. ఇప్పుడు అలాంటి టాపిక్కే ఒకటి ట్రెండింగ్‌లో ఉంది.
ఈ మధ్యే తెలుగులో నాయకుడు పేరుతో ఓ తమిళ చిత్రం అనువాదమైన సంగతి తెలిసిందే. తమిళంలో ఆ చిత్రం పేరు.. మామన్నన్. ఇంతకుముందు పరియేరుం పెరుమాళ్, కర్ణన్ లాంటి క్లాసిక్స్ తీసిన మారి సెల్వరాజ్ ఈ చిత్ర దర్శకుడు. మామన్నన్ కూడా తమిళంలో మంచి హిట్టయింది. తెలుగలో మంచి సినిమాను పేరు తెచ్చుకున్నప్పటికీ సరిగా ఆడలేదు.
మామన్నన్ సినిమాలో హీరోలుగా చేసింది వడివేలు, ఉదయనిధి స్టాలిన్‌లే కానీ.. పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ మార్కులు వేయించుకుంది.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది మాత్రం విలన్ రోల్ చేసిన ఫాహద్ ఫాజిలే. జాత్యహంకారం నరనరాన నింపుకున్న అగ్ర కులస్థుడైన రాజకీయ నాయకుడిగా టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు ఫాహద్ ఇందులో. సినిమాలో అతడి పాత్ర చాలా క్రూరంగా, భయపెట్టేలా ఉంటుంది. ఐతే అలాంటి పాత్రకు సోషల్ మీడియా జనాలు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ఒకవేళ సినిమాలో అతను హీరో అయితే ఎలా ఉంటుందనే ఊహతో రెండు రోజులుగా వీడియో ఎడిట్స్‌తో మోత మోగించేస్తున్నారు. సినిమాలో ఫాహద్ విలనీ పండించిన సీన్లు, షాట్సే తీసుకుని.. వాటికి హీరో ఎలివేషన్ ఉన్న పాటలు జోడించి.. ఆ పాత్రను పూర్తి పాజిటివ్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. తమిళ నెటిజన్లలో ఇదొక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు మామన్నన్ తెలుగు వెర్షన్ ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంటుండటంతో తెలుగు నెటిజన్లు కూడా ఈ వీడియోలకు కనెక్టవుతున్నారు.
This post was last modified on July 30, 2023 11:42 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…