తొలి సినిమా బ్లాక్ బస్టర్ అందుకునే అదృష్టం ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ కే దక్కింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కొండపొలం, రంగ రంగ వైభవంగా రెండు వరస డిజాస్టర్లు అతని మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. ప్రతి శుక్రవారం మీడియం రేంజ్ హీరోల జాతకాలు మారిపోతున్న ట్రెండ్ లో ఎక్కువ ఫ్లాపులు పడితే ఎంత మెగా హీరో అయినా ప్రమాదమే. అందుకే ఆదికేశవ మీద బోలెడు నమ్మకంతో రెడీ అవుతున్నాడీ కుర్ర హీరో. ముందు అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఆగస్ట్ 18న విడుదల జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడీ సినిమా వాయిదాబాట పట్టక తప్పేలా లేదు.
దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది చిరంజీవి భోళా శంకర్ కు కేవలం వారం గ్యాప్ లో రావడం ఎంత లేదన్నా రిస్కే. ప్రీ రిలీజ్ టాక్ ఎలా ఉన్నా ఒకవేళ హిట్ అయితే మాత్రం మెగాస్టార్ ఊపు ఓ రెండు వారాలు ఈజీగా ఉంటుంది. జైలర్ కూడా సక్సెస్ అయితే థియేటర్ల ఇబ్బంది వస్తుంది. అనుష్క నవీన్ పోలిశెట్టిల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని 18న దింపే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆపై 25న వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునతో వచ్చేస్తాడు. ఇంత పెద్ద పద్మవ్యూహంలో ఆదికేశవ నలిగిపోవడం ఖాయం. అందుకే పోస్ట్ పోన్ కావొచ్చు.
మరో ప్రతికూలాంశం ఆదికేశవకు కావాల్సిన బజ్ ఇంకా ఏర్పడలేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేయలేదు. ఇప్పటిదాకా కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే వచ్చింది. ఓ గుడి చుట్టూ తిరిగే యాక్షన్ కం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆదికేశవ రూపొందింది. శ్రీలీల హీరోయిన్ గా నటించడమే ప్రధాన హైలైట్ గా ఆడియన్స్ దృష్టిలో ఉంది. ఇదొక్కటే సరిపోదు. సరైన పబ్లిసిటీ ప్లాన్ చేసుకుని హైప్ పెరిగేందుకు ఈవెంట్లు ప్రోగ్రాంలు చేయాలి. సో తొందపడి ఏదో ఒక డేట్ అనుకుని వదిలేయడానికి లేదు. ప్రొడ్యూసర్ల నుంచి దీనికి సంబంధించి క్లారిటీ రావడమే ఆలస్యం.
This post was last modified on July 30, 2023 10:50 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…