ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడానికి పరుగులు పెడుతున్న బేబీకి స్టార్ సెలబ్రిటీల మద్దతు ఫుల్లుగా దొరుకుతోంది. విజయ్ దేవరకొండ అతిథిగా సక్సెస్ మీట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా అప్రిషియేషన్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ తో పేరుతో హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నారు. రెండు రోజుల క్రితమే దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కెఎన్ లను చిరు ఇంటికి పిలిచి మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అక్కడితో అయిపోయిందనుకుంటే ఏకంగా ఫ్యాన్స్ ముందుకు వచ్చి ప్రశంసలు అందించేందుకు రెడీ అయ్యారు. ఇది బేబీ బృందానికి పెద్ద బూస్ట్ కాబోతోంది. ఎందుకంటే బ్రో వచ్చినా కూడా ఈ చిన్న సినిమా జోరు మరీ కిందకు పడిపోలేదు. చాలా చోట్ల కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. స్క్రీన్లు భారీగా తగ్గాయి కానీ సోమవారం నుంచి వాటిలో కొన్ని తిరిగి ఇచ్చేందుకు ఎగ్జిబిటర్లు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 75 కోట్ల చేరువలో ఉన్న గ్రాస్ ని వంద కోట్ల మైలురాయి దాకా తీసుకెళ్లాలన్నది బేబీ బృందం లక్ష్యం. బాక్సాఫీస్ పరిస్థితులు చూస్తే అదేమంత కష్టం కాదనిపిస్తోంది.
రేపు చిరు కురిపించబోయే కాంప్లిమెంట్, క్యాస్టింగ్ తో సహా అందరూ మెగాస్టార్ ని పొగడబోయే వైనం అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇంకో పది రోజుల్లో భోళా శంకర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరు ప్రమోషన్ల కోసం పూర్తిగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వచ్చే వారం నుంచి ఇంటర్వ్యూలు ఊపందుకోబోతున్నాయి. ఆగస్ట్ 5 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నారు కానీ వాతావరణం, వర్షాల దృష్ట్యా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బేబీ వేడుకకు హాజరైన సందర్భంలో దీనికి సంబంధించిన ముచ్చట్లు కూడా ఏమైనా పంచుకోవచ్చు. మొత్తానికి పబ్లిసిటీలోనూ బేబీ సెన్సేషన్ గానే ఉంది.
This post was last modified on July 29, 2023 10:25 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…