సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్థాయికి తగ్గ హిట్ కొట్టి చాలా ఏళ్లయిపోయింది. ‘రోబో’ తర్వాత ఆయన సినిమాలన్నీ నిరాశపరిచినవే. ‘కబాలి’.. ‘2.ఓ’ భారీ వసూళ్లే సాధించినప్పటికీ.. వాటిని ‘హిట్’ కేటగిరీలోకి వేయలేని పరిస్థితి. చివరగా సూపర్ స్టార్ నుంచి వచ్చిన ‘అన్నాత్తె’ అయితే పెద్ద డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానుల ఆశలన్నీ ‘జైలర్’ మీదే ఉన్నాయి.
‘కోలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాలు రూపొందించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అతడి తొలి రెండు చిత్రాలూ సూపర్ హిట్లయినప్పటికీ.. విజయ్ లాంటి టాప్ స్టార్‌తో తీసిన ‘బీస్ట్’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సినిమా విడుదలకు ముందే సూపర్ స్టార్‌తో ‘జైలర్’ కమిటయ్యాడు నెల్సన్.
కానీ ‘బీస్ట్’ రిజల్ట్ తేడా కొట్టడంతో అతణ్ని దర్శకుడిగా తప్పించాలని తనకు ఫోన్లు వచ్చినట్లు రజినీ వెల్లడించడం గమనార్హం. శుక్రవారం రాత్రి జరిగిన ‘జైలర్’ ఆడియో వేడుకలో రజినీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘బీస్ట్ షూటింగ్ పూర్తయ్యాక నెల్సన్ నన్ను కలిసి ‘జైలర్’ స్టోరీ లైన్ చెప్పాడు. నేను పూర్తి స్క్రిప్టుతో రమ్మన్నా. అంతకుముందు నాకు ఇలా లైన్ చెప్పిన దర్శకులు తర్వాత బౌండ్ స్క్రిప్టుతో వచ్చినపుడు నాకు అవి నచ్చలేదు. కానీ నెల్సన్ పది రోజుల తర్వాత అద్భుతమైన స్క్రిప్టుతో వచ్చాడు. వెంటనే నచ్చి సినిమా ఓకే చేశా. కానీ ‘బీస్ట్’ సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్ చేశారు. నెల్సన్‌ను దర్శకుడిగా తప్పించమన్నారు. కానీ నేను అతణ్ని నమ్మాను. ‘సన్ పిక్చర్స్’ అధినేతలు కూడా నాకు ఒకే మాట చెప్పారు. ‘బీస్ట్’కు మంచి రివ్యూలు రాలేదు కానీ.. డిస్ట్రిబ్యూటర్లెవ్వరూ నష్టపోలేదని.. ఆ సినిమా కమర్షియల్ కోణంలో ఫ్లాప్ కాదని అన్నారు. దీంతో నెల్సన్‌తోనే ముందుకు సాగాం. అతను అద్భుతమైన సినిమా తీశాడు’’ అని సూపర్ స్టార్ చెప్పారు.
This post was last modified on July 29, 2023 1:55 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…