నటనకు ఛాలెంజ్ ఇచ్చే పాత్రలనే ఎక్కువగా ఎంచుకునే ధనుష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం బాగా తగ్గించేశాడు. అందుకే తన డబ్బింగులు చాలా మటుకు రావడం లేదు. కర్ణన్ ఎంత గొప్పగా ఆడినా మన ఆడియన్స్ కి సూట్ అవ్వదనే ఉద్దేశంతో అటు అనువాదం జరగలేదు ఇటు రీమేక్ కాలేదు. అంతటి క్రియేటివ్ సబ్జెక్ట్ సెలక్షన్ తో దూసుకెళుతున్న ధనుష్ కొత్త సినిమా కెప్టెన్ మిల్లర్ వచ్చే డిసెంబర్ 15 విడుదలకు రెడీ అవుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు టీజర్ వదిలారు. కాన్సెప్ట్ చూస్తే షాక్ ఇచ్చేలా ఉంది.
స్వతంత్రం రాకముందు దేశం బ్రిటిష్ పాలన ఉన్న నాటి రోజుల్లో అడవికి దగ్గర్లో ఉండే ఒక మారుమూల గిరిజన తండా లాంటి ఊరు. హఠాత్తుగా వచ్చి మీద పడుతుంది ఇంగ్లీష్ సైన్యం. దానికి ఎదురొడ్డి నిలబడతాడు మిల్లర్(ధనుష్). ఒక విప్లవకారుడి మాదిరి వాళ్ళతో తలపడి విధ్వంసం సృష్టిస్తాడు. అయితే తెల్లదొరలు దాడికి తెగబడేందుకు కారణం ఏంటి, ఇంతకీ మిల్లర్ అంటే నిజంగా మనం అనుకుంటున్న వ్యక్తా లేక మరొకరు ఉన్నారా అనేది సస్పెన్స్. విజువల్స్ మొత్తం రా అండ్ రస్టిక్ గా ఉన్నాయి. భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు.
తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, సిద్దార్థ నుని ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో సాగాయి. స్టోరీని ఎక్కువ రివీల్ చేసే అవకాశం ఇవ్వకుండా తెలివిగా కట్ చేయించారు దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. ఇప్పటిదాకా గ్లామర్ డాల్ గానే కనిపిస్తూ వచ్చిన ప్రియాంకా మోహన్ కి తుపాకీ ఇచ్చి పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ ఇచ్చారు. మొత్తానికి ఇంటెన్సిటీతో నిండిన కెప్టెన్ మిల్లర్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలానే కనిపిస్తోంది. క్రిస్మస్ కు గట్టి పోటీ ఉండటంతో తెలివిగా పది రోజుల ముందే మిల్లర్ థియేటర్లకు వస్తున్నాడు
This post was last modified on July 28, 2023 11:19 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…