టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొన్నేళ్ల కిందటే తన కొడుకు సంజయ్ రావును హీరోగా పరిచయం చేశాడు. అతడి అరంగేట్ర చిత్రం ‘పిట్టకథ’ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. సంజయ్ రావు ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయాడు. తర్వాత అతను బాగా గ్యాప్ తీసుకుని ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే సినిమా చేశాడు. ప్రణవి మానుకొండ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి ఇలా చాలామంది పేరున్న తారాగణం ఉన్నారు.
ఏఆర్ శ్రీధర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ టైటిల్ చూస్తేనే ఇదొక కామెడీ మూవీ అనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకునేలాగే ఉన్నాయి. కానీ రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ చేయడమే ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’కు పెద్ద ప్రతికూలతగా మారింది. ఈ నెల 21నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు పోటీ ఉందని వారం వాయిదా వేశారు.
ఈ వారం ‘బ్రో’ లాంటి భారీ చిత్రం పోటీలో ఉండగా.. తర్వాతి రోజు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ను రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల ముందు వచ్చిన ‘బేబి’ ఇంకా బాగా ఆడుతోంది. ఇంగ్లిష్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్, ఓపెన్ హైమర్, బార్బీలకు మల్టీప్లెక్సుల్లో పెద్ద ఎత్తున షోలు కొనసాగుతున్నాయి. ఈ వారం ‘బ్రో’కు తోడు ‘రాకి ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ రిలీజవుతోంది. ఇంత పోటీ మధ్య ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’కు పెద్దగా స్క్రీన్లు, షోలే దక్కలేదు.
ఇన్ని సినిమాల మధ్య ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది కూడా సందేహమే. దీని కంటే గత వారం వచ్చినా బాగుండేది. వచ్చే వారం రావాల్సిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వాయిదా పడింది కాబట్టి.. సినిమాను ఆ రోజుకు రీషెడ్యూల్ చేసుకోవాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ సినిమా బాగున్నా కూడా ఆడుతుందా అన్నది డౌటే. కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్న బ్రహ్మాజీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సింది.
This post was last modified on July 28, 2023 11:11 am
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…