టాలీవుడ్ ఒక పెద్ద సినిమా వస్తోందంటే.. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ మొదలైపోతాయి. రికార్డుల లెక్కలు తీసి.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదించుకుంటారు స్టార్ హీరోల ఫ్యాన్స్. కొత్తగా రాబోతున్న సినిమాకు టార్గెట్లు కూడా ఫిక్స్ చేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆటోమేటిగ్గా ఈ చర్చ ఉంటుంది. ఐతే ‘బ్రో’ సినిమా విషయంలో మాత్రం పవన్ అభిమానులు కొంత సంయమనం పాటిస్తున్నారు.
సవాళ్లకు వెళ్లట్లేదు. వాళ్లను ఇతర హీరోల అభిమానులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ చేయట్లేదు. కానీ రిలీజ్ రోజు కథ వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు హైప్ కొంచెం తక్కువగా ఉండటం, రిలీజ్ కూడా మరీ భారీగా లేకపోవడం వల్ల వసూళ్లు పవన్ గత సినిమాల స్థాయిలో ఉండకపోవచ్చన్నది స్పష్టం. మరి ఆ పరిస్థితుల్లో పవన్ స్టామినాను ప్రశ్నిస్తూ వేరే హీరోల అభిమానులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సహజం.
కానీ ‘బ్రో’ సినిమాకు ఉన్న పరిమితులు, ప్రతికూలతల దృష్ట్యా దీన్ని రికార్డుల కోణంలో చూడకపోవడమే బెటర్. ఇదొక రీమేక్, పైగా క్లాస్ మూవీ. దీన్ని మాస్ సినిమాల గాటన కట్టకూడదు. దీనికి తోడు రిలీజ్ పరంగా కూడా దీనికి ప్రతికూలతలు ఉన్నాయి. మామూలుగా పెద్ద సినిమాలకు పెంచినట్లు దీనికి రేట్లు పెంచట్లేదు. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా సాధారణ ధరలతోనే రిలీజ్ చేస్తున్నారు. దీనికి తోడు ‘బ్రో’కు వేరే పెద్ద సినిమాల రేంజిలో పెద్ద రిలీజ్ కూడా దక్కట్లేదు. ‘బేబీ’ సినిమా బాగా ఆడుతుండటంతో దానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు కొనసాగిస్తున్నారు.
మల్టీప్లెక్సుల్లో ఇంగ్లిష్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్, ఓపెన్ హైమర్, బార్బీ చిత్రాలకు ఈ వీకెండ్లోనూ స్క్రీన్లు బాగానే అట్టిపెట్టారు. హిందీ చిత్రం ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ కూడా హైదరాబాద్ లాంటి సిటీల్లో స్క్రీన్లు బాగానే దక్కించుకుంది. ఈ పరిస్థితుల్లో ‘బ్రో’కు స్క్రీన్లు, షోలు తగ్గిపోయాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ‘బ్రో’ రికార్డుల వేటలో ముందు ఉండే పరిస్థితి ఉండదు. మరోవైపు పవన్‌ది ఈ సినిమాలో లీడ్ రోల్ కూడా కాదు, సాయితేజే ఇందులో హీరో. కాబట్టి దీన్ని మిగతా పవన్ సినిమాలతో పోల్చి రికార్డుల లెక్కలు వేయడం కరెక్ట్ కాదు.
This post was last modified on July 28, 2023 10:49 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…