నేచురల్ స్టార్ నాని టాలెంట్ తమిళ ప్రేక్షకులకు చాలా ఏళ్ల ముందే తెలుసు. ‘ఈగ’ తమిళంలో కూడా బాగానే ఆడింది. దాంతో పాటు ‘సెగ’ సినిమాతో తమిళ ప్రేక్షకులను నేరుగానే పలకరించాడు నాని. అక్కడ మంచి గుర్తింపు లభించినప్పటికీ.. తర్వాత తమిళం మీద అతను పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ‘దసరా’ చిత్రంతో తమిళంలోకి వెళ్లే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
ఐతే తమిళంలో నానికి మళ్లీ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఇప్పుడు అతడి తలుపు తట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్.. సూపర్ స్టార్‌తో జట్టు కట్టబోతున్నాడట. రజినీకాంత్ కొత్త చిత్రంలో నాని ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ స్టార్.. ‘జై భీమ్’ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందు రజినీతో ‘2.ఓ’ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు నానిని ఎంచుకున్నాడట జ్ఞానవేల్. ‘జై భీమ్’ చూశాక జ్ఞానవేల్‌తో పని చేయడానికి ఏ నటుడైనా ఆసక్తి చూపిస్తాడు. పైగా రజినీకాంత్‌తో కలిసి నటించడం అన్నా కూడా అదొక గొప్ప అవకాశమే. కాబట్టి నానికి నిజంగా ఈ ఆఫర్ వస్తే అతను కాదనే అవకాశమే లేదు. డేట్ల సమస్య ఉన్నా కూడా ఎలాగోలా సర్దుబాటు చేస్తాడనడంలో సందేహం లేదు.
‘హాయ్ నాన్న’ తర్వాత నాని కొత్త సినిమాను ఇంకా ప్రకటిచంలేదు. అతను ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనే మరో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ లోపు రజినీ సినిమాలో స్పెషల్ రోల్ గురించి న్యూస్ బయటికి వచ్చింది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ‘హాయ్ నాన్న’ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 27, 2023 8:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…