మావయ్య తో కలిసి బ్రో సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్న మెగా హీరో సాయి తేజ్ , నెక్స్ట్ సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ నుండి ప్రేరణ పొంది ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే టీం నుండి ఈ టైటిల్ ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా తేజ్ ఈ టైటిల్ ను ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు.
‘బ్రో’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజ్ అందులో భాగంగా నెక్స్ట్ సంపత్ నంది తో గాంజా శంకర్ సినిమా చేస్తున్నానని తెలిపాడు. ఆరోగ్య పరంగా ఆరు నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పుకున్నాడు. ఆరు నెలలు పూర్తిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకొనున్నట్లు చెప్పాడు. కొన్ని నెలల క్రితమే సంపత్ నంది తో ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు తేజ్.
సితార ఎంటర్టైన్ మెంట్స్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. సాయి తేజ్ కి హీరోయిన్ గా పూజ హెగ్డే , లేదా శ్రీలీలను అనుకుంటున్నారు, ఈ ఇద్దరి డేట్స్ కూదరకపోతే మరో హీరోయిన్ కి ఛాన్స్ దక్కనుంది. కొన్నేళ్ళుగా హిట్ కోసం పరితపిస్తున్న సంపత్ నంది ఈ సినిమాతో దర్శకుడిగా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
This post was last modified on July 27, 2023 1:20 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…