నిన్న జరిగిన పేక మేడలు టీజర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ అన్న మాటలు కొత్త చర్చకు దారి తీశాయి. బేబీ ఆఫర్ మొదట తనకే వచ్చిందని, అయితే దర్శకుడి పేరు చెప్పగానే కనీసం కథ వినకుండా నో చెప్పాడని రకరకాల ప్రచారం జరిగింది. అయితే సాయిరాజేష్ తన ప్రస్తావన నేరుగా ఎక్కడా తేకపోయినా ఇది ఎవరి గురించోనని అర్థం చేసుకున్న నెటిజెన్లు, సోషల్ మీడియా వర్గం దాన్ని విశ్వక్ కు ఆపాదించేశాయి. అయితే అది నిజమేననే క్లారిటీ క్రమంగా వచ్చింది. సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సైతం ఇన్ డైరెక్ట్ గా ఈ ఉదంతాన్ని కోట్ చేయడంతో ఇంకాస్త వైరల్ అయ్యింది.
తాజాగా విశ్వక్ చేసిన కామెంట్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చాయి. బేబీ, సాయిరాజేష్ ల ప్రస్తావన తేకుండా ఏదైనా సినిమా ఒప్పుకోవడం నో చెప్పడం తన స్వేచ్ఛని, అంతమాత్రాన బురద జల్లాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఒక చిన్న చిత్రం పెద్ద విజయం సాధించినప్పుడు సంతోషపడే వాళ్ళలో తాను ముందుంటానని, డైరెక్టర్ల వాట్స్ అప్ గ్రూప్ లో మొదట శుభాకాంక్షలు చెప్పింది తనేన ని మరో వివరణ ఇచ్చాడు. దీన్ని బట్టే ఈ వ్యవహారం ఇతన్ని బాగా హర్ట్ చేసిందని అర్థమవుతోంది. నిజంగానే బేబీలో ఆనంద్ పాత్రకు విశ్వక్ అంతగా సూటయ్యేవాడు కాదనేది వాస్తవం.
ఆ మధ్య సీనియర్ హీరో అర్జున్ ప్రాజెక్టు నుంచి బయటికి రావడం మీడియా సాక్షిగా విశ్వక్ సేన్ కి కొంత ఇబ్బంది తెచ్చి పెట్టింది. ప్రారంభంలోనే ఆగిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇష్యూ చాలా సీరియస్ అయ్యేది. సరే దాన్ని జనాలు త్వరగా మర్చిపోయినా బేబీ వల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్స్ చేస్తున్న విశ్వక్ సేన్ కి ఆ మధ్య దాస్ కా ధమ్కీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దానికి తోడు అవసరం లేని వివాదాలు ఇలా చుట్టుముడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట బరస్ట్ కావడం తప్ప చేయగలిగింది ఏముంది.
This post was last modified on July 27, 2023 12:58 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…