టాలీవుడ్లో కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఓ పెద్ద సినిమా రిలీజవుతోంది. అదే.. బ్రో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో హీరో కాని హీరో. లీడ్ రోల్ చేసింది సాయిధరమ్ తేజ్‌యే అయినా.. ఇది అతడి సినిమాగా చూడలేం. సినిమాలో 90 శాతం నిడివిలో పవన్ ఉంటాడు కాబట్టి ఆయన కూడా లీడ్ రోల్ చేసినట్లే. దీన్ని పవన్ మూవీగానే అభిమానులు చూస్తున్నారు. ఐతే పవన్ గత సినిమాలతో పోలిస్తే దీనికి కొంచెం హైప్ తక్కువగా ఉంది.
అందుకు రీమేక్ కావడం, క్లాస్ మూవీ కావడం.. పవన్ చేసింది మాస్ పాత్ర కాకపోవడం.. ఇలా రకరకాల కారణాలున్నాయి. ఈ సినిమా పాటలు కూడా అభిమానులను అంతగా ఎగ్జైట్ చేయలేకపోయాయి. సినిమా బుకింగ్స్ మొదలుపెట్టడం కూడా కొంచెం లేటవడంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న డౌట్లు కొట్టాయి. కానీ బుధవారం ఆ సందేహాలన్నింటికీ తెరపడిపోయింది.
విడుదలకు రెండు రోజుల ముందు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలైపోయాయి. ఉదయం నుంచి టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్లో జరుగుతున్నాయి. పవన్ గత సినిమాల రేంజిలో ఇలా పెడితే అలా నిమిషాల్లో టికెట్లు అయిపోయే పరిస్థితి లేదు కానీ… బుకింగ్స్ జోరుగానే నడుస్తున్నాయి. కొన్ని గంటల వ్యవధిలో సోల్డ్ ఔట్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మెజారిటీ థియేటర్లలో సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఐతే సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలే కావడంతో షోలు మరీ ముందుగా ఏమీ మొదలు కావడం లేదు. 8 గంటలకు, ఆ తర్వాతే తొలి షోలు పడబోతున్నాయి.
చాలా వరకు 8.30, 8.45 షోలే ఫిక్స్ చేశాయి థియేటర్లు. రెండు రాష్ట్రాల్లోనూ తొలి వీకెండ్లో ఐదు షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక నిర్మాత విశ్వప్రసాద్ అన్నట్లే రెండు చోట్లా టికెట్ల ధరలు పెంచలేదు. రెగ్యులర్ రేట్లకే అమ్మకాలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా రేట్ల పెంపు కోసం ప్రయత్నించినట్లు కనిపించడం లేదు. బుకింగ్స్ తీరు చూస్తుంటే డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయనిపిస్తోంది. కానీ ఎప్పట్లా పవన్ సినిమా అంటే రికార్డుల గురించి మాట్లాడుకునే పరిస్థితి మాత్రం ఈసారి ఉండకపోవచ్చు.
This post was last modified on July 27, 2023 12:42 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…