మెగా బ్రదర్స్ ముద్దులు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అంటే ఎనర్జీకి మారుపేరు. డ్యాన్సులు, ఫైట్లలో అతను చూపించే హుషారే వేరు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో అతను వేసిన స్టెప్పులు, చూపించిన స్టైల్‌కు మెగా అభిమానులే కాక అందరూ ఫిదా అయిపోయారు. ఐతే ఇప్పుడు తేజులో ఆ జోష్ లేదు. అందుకు కారణం ఏంటో అందరికీ తెలుసు. రెండేళ్ల కిందట అతను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి కొన్ని నెలల పాటు బయటికి రాలేకపోయాడు. తర్వాత కోలుకుని సినిమాలు చేస్తున్నప్పటికీ అతడిలో మునుపటి ఉత్సాహం మాత్రం లేదు. ‘విరూపాక్ష’లో తన కదలికలు, డైలాగ్ డెలివరీ నెమ్మదించాయి. ‘బ్రో’ సినిమాలో కూడా అదే కంటిన్యూ అవుతోంది. స్వయంగా తేజును తాను మునుపటిలా లేనని.. పూర్తి స్థాయిలో ఆరోగ్యం సంతరించుకోలేదని మీడియా ఇంటర్వ్యూల్లో ఓపెన్ అయ్యాడు.
ఐతే తాజాగా ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తేజు ప్రసంగం చేస్తున్న సమయంలో మాట తడబడింది. అభిమానులకు థ్యాంక్ యు చెప్పబోతుంటే.. నోటి నుంచి సరిగా మాట రాలేదు. ఐతే ఇది చూసి కొందరు అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. అతను మందు కొట్టాడేమో అని కౌంటర్లు వేస్తున్న వాళ్లూ లేకపోలేదు. అలాగే ‘కిల్లి కిల్లి’ పాటలో పవన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నపుడు ఆయన ఎనర్జీని తేజు మ్యాచ్ చేయలేకపోయాడని విమర్శిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ చాలామంది ఈ విషయాన్ని కామెడీగానే చూస్తున్నారు. కానీ యాక్సిడెంట్ తర్వాత తేజు మాటల విషయంలోనూ ఇబ్బంది పడ్డాడు. ఇంతకుముందులా స్పష్టంగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు.
తన ఇంటర్వ్యూలు చూసినా సరే.. కొన్నిసార్లు మాటల్లో స్పష్టత ఉండట్లేదు. ‘విరూపాక్ష’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రసంగం చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఐతే ఇన్ని ఇబ్బందులున్నా.. తాను ఆగిపోకూడదనే ఉద్దేశంతో కష్టపడి మేనేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. అతడి సంకల్ప బలానికి అందరూ సలామ్ కొట్టాలి. గత ఏడాది కాలంలో తేజు నెమ్మది నెమ్మదిగా మెరుగు పడుతూ వస్తున్న తేజు.. వచ్చే మూణ్నాలుగు నెలలు సినిమాలకు దూరంగా ఉండి పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ప్రయత్నించబోతున్నాడు. ఈ విషయం తెలియకుండా అతణ్ని ట్రోల్ చేయడం భావ్యం కాదు.
This post was last modified on July 26, 2023 7:42 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…