ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్’తో భారీ విజయం అందుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. దీని తర్వాత ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘జవాన్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. తమిళంలో రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఒక సౌత్ డైరెక్టర్.. షారుఖ్‌ను ఎలా డీల్ చేస్తాడో అని చాలామంది సందేహించారు కానీ.. ట్రైలర్ చూశాక ఆ సందేహాలన్నీ ఎగిరిపోయాయి.
‘పఠాన్’కు ఏమాత్రం తగ్గని యాక్షన్ అడ్వెంచర్ లాగా కనిపించింది ట్రైలర్ చూస్తే. సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఐతే సినిమాలో మరెన్నో సర్ప్రైజ్‌లు ఉంటాయని.. షారుఖ్ ఫ్యాన్స్ అనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ‘జవాన్’ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ టాప్ స్టార్ విజయ్ క్యామియో చేసినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇప్పుడా విషయం నిజమే అని తేలింది. ‘జవాన్’లో విజయ్ కొన్ని నిమిషాల పాటు తళుక్కుమనబోతున్నట్లు న్యూస్ అధికారికంగానే బయటికి వచ్చింది. మరి విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరం. విజయ్ ఈ సినిమాలో కనిపించేట్లయితే.. తమిళంలో ‘జవాన్’కు బాగా ప్లస్ కావడం ఖాయం.
ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించడం.. విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించడం.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం వల్ల ‘జవాన్’ తమిళులతో పాటు సౌత్ జనాలకు కనెక్ట్ అవుతోంది. విజయ్ కూడా దక్షిణాదిన ఇంకా క్రేజ్ వస్తుంది. షారుఖ్ ఉన్నాడు కాబట్టి నార్త్ అంతా సినిమా దున్నేయడం ఖాయం. షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ ఇందులో దేశం కోసం పాటుపడే సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
This post was last modified on July 25, 2023 8:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…