మొదట హీరోగా , తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ను హీరోగా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంజయ్ ఓ పిట్ట కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు రెండో సినిమా స్లమ్ డాగ్ హస్బండ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి బ్రహ్మాజీ తన పరిచయాలతో కొంత బజ్ తీసుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ , శ్రీ లీల ను ఇన్వైట్ చేశారు.
తాజాగా సంజయ్ ఓ ఇంటర్వ్యూలో తనకి బన్నీ అంటే ఎంత ఇష్టమో బయటపెట్టాడు. “బన్నీని చూసే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. ఆయనలాగా కష్టపడి పైకి రావాలని ఉంది. బన్నీ జర్నీ నాకు తెలుసు. ఒక పెద్ద నిర్మాత కొడుకు.. ఈజీగా దొరికి ఉంటుందని బయట అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. ఇవాళ బన్నీ ఆఫీసు ముందు వెళ్లి ఓ గిఫ్ట్ అన్నకు ఇవ్వమని వాళ్ల అసిస్టెంట్‌కు ఇచ్చి వచ్చా. మళ్లీ రేపు వెళ్లి కలుస్తా” అంటూ చెప్పుకున్నాడు సంజయ్. దీంతో బ్రహ్మాజీ కొడుకుకి బన్నీ అంటే ఇంత పిచ్చా ? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఇక బన్నీ పుష్ప ఘాట్ లో ‘స్లమ్ డాగ్ హస్బండ్’ ట్రైలర్ చూసి నాన్నతో అదిరిపోయిందని చెప్పి ఫహాద్ ఫాసిల్ ను కూడా ట్రైలర్ చూడామని చెప్పాడని ఆ విషయం విన్నప్పుడు ఎంతో సంతోష పడ్డానని సంజయ్ తన ఫీలింగ్ బయట పెట్టాడు. ఇటీవలే ధోనీ భార్య తను అల్లు అర్జున్ ఫ్యాన్ అంటూ చెప్పుకుంది. ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు తన ఫ్యానిజంను గిఫ్ట్ తో బయట పెట్టాడు. దీంతో పుష్ప2 అప్ డేట్స్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇవన్నీ వాటిని మర్చిపోయేలా చేస్తున్నాయి.
This post was last modified on July 25, 2023 8:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…