ఒకప్పుడు టాలీవుడ్లో చాలా బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. ఒక సమయంలో అతను నటించిన తొమ్మిది సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఏడాదికి మూడు చొప్పున సినిమాలు రిలీజ్ చేసేవాడు రోహిత్. కమర్షియల్ సక్సెస్ అయ్యాయా లేదా అన్నది పక్కన పెడితే.. రోహిత్ సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి అనే పేరు అయితే వచ్చింది. రౌడీ ఫెలో సహా కొన్ని సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
కానీ ఎలాంటి హీరోకైనా వరుసగా ఫ్లాపులు వస్తే తట్టుకోవడం కష్టమే. రోహిత్ కూడా అలాగే ఇబ్బంది పడ్డాడు. అనూహ్యంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. నాలుగేళ్ల నుంచి ఏ సినిమా చేయట్లేదు. అందరూ అతణ్ని మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు ‘ప్రతినిధి-2’తో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం పెద్ద సర్ప్రైజ్.
ఐతే నారా రోహిత్ రీఎంట్రీకి ఇది సరైన సినిమానేనా అన్నది ఇప్పుడు ప్రశ్న. తన కెరీర్ ఆల్రెడీ దెబ్బ తింది. జనాలు దాదాపుగా అతణ్ని మరిచిపోయారు. ఇలాంటి సమయంలో కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే.. లేదంటే తన మార్కు వైవిధ్యమైన థ్రిల్లర్ టచ్ ఉన్న సినిమా చేస్తే బాగుండేదేమో. కానీ అతను మాత్రం పొలిటికల్ టచ్ ఉన్న ప్రాపగండా తరహా సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. నారా రోహిత్ గతంలో చేసిన కొన్ని సినిమాల్లోనూ పొలిటికల్ టచ్ ఉంది. ‘ప్రతినిధి’ ఆ కోవకు చెందిన చిత్రమే.
ఇప్పుడు టీడీపీకి బలమైన మద్దతుదారుగా పేరున్న మూర్తి దర్శకత్వంలో సినిమా చేస్తూ.. 2024 ఎన్నికల ముంగిట రిలీజ్ చేయాలనుకుంటున్నారంటే ఇది కచ్చితంగా పొలిటికల్ ప్రాపగండా ఫిలిం అనే ముద్ర పడిపోతుంది. సినిమా రంగంలో ఏ అనుభవం లేని మూర్తి.. ఇలా నేరుగా డైరెక్షన్ చేసేస్తుండటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఒక జర్నలిస్ట్ కోణంలో రాజకీయ సినిమా మాత్రమే తీయగలరేమో అనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే కెరీర్ స్ట్రగుల్లో ఉన్న టైంలో రోహిత్‌కు ఇది సరైన రీఎంట్రీయేనా అన్న సందేహాలైతే కలుగుతున్నాయి. మరి ‘ప్రతినిధి-2’తో ఈ అభిప్రాయాలను అతను మారుస్తాడేమో చూడాలి.
This post was last modified on July 25, 2023 5:13 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…