ఇటీవలే అమెజాన్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆరు నెలల బ్రేక్ తీసుకున్న సమంతా గతంలో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి మరీ ప్రశాంతత కోసం టూర్ మొదలుపెట్టింది. ముందు వేలూరులోని స్వర్ణ దేవాలయంని సందర్శించింది. ఆ తర్వాత ఈషా యోగ సెంటర్ లో మెడిటేషన్ సెషన్ కు హాజరయ్యింది. అక్కడి నుంచి ఆదివారం బాలికి వెళ్ళిపోయి ఏరియల్ యోగాసనాలు, కఠినమైన డైట్ తో శారీకరంగా, మానసికంగా ధృడంగా మారే దిశగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.
ఇంకో ముప్పై అయిదు రోజుల్లో విజయ్ దేవరకొండ ఖుషి రిలీజ్ కానుంది. దాని ప్రమోషన్లకు హాజరు కావడం కోసం యాత్ర నుంచి బ్రేక్ తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే టీమ్ తానున్న చోటికే వెళ్లి ఇంటర్వ్యూలు గట్రా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. గతంలోనూ యశోదకు ఇదే తరహాలో చేసినప్పుడు వర్కౌట్ అయ్యింది కనక ఈసారి కూడా అదే పద్దతి ఫాలో కావొచ్చు. సిటాడెల్ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ చేశాక దానికి సంబంధించిన పబ్లిసిటీలో భాగం కావాల్సి ఉంటుంది. దాని తాలూకు నిబంధన అగ్రిమెంట్ లోనే ఉంటుంది కాబట్టి సామ్ అప్పుడు బయటికి రావొచ్చు.
ఈ రెండు బాధ్యతలు తప్ప సమంతా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. తాజాగా జుత్తుని కత్తించుకుని ఇచ్చిన స్టిల్స్ ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. ఎలాగూ షూటింగులు లేవు కాబట్టి హెయిర్ స్టైల్ తో ప్రత్యేకంగా పనేం లేదు. అందుకే పొట్టి శిరోజాలకు ఓటేసింది. ఆఫర్లకు లోటు లేకపోయినా హెల్త్ విషయంలో డాక్టర్ లు చేసిన సూచన మేరకు సామ్ ఇంత రెస్ట్ తీసుకోవాల్సిన పని పడింది. శాకుంతలం డిజాస్టర్ బాధ పెట్టినా ఖుషి ఆ లోటుని పూర్తిగా తీరుస్తుందన్న నమ్మకం తనలో ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 1న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
This post was last modified on July 25, 2023 2:53 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…